అంతరిక్షం.. ఆరోగ్యం జాగ్రత్త! 

Published on Mon, 12/31/2018 - 01:04

అంతరిక్షం..అబ్బా చూడ్డానికి ఎంత బాగుంటుందో.. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అయితే తెల్లటి సూటులేసుకుని. డింగుడింగుమంటూ ఎగురుతూ తిరుగుతూ ఉంటే..భలే మజా వస్తుంది కదూ..నిజంగానే.. అక్కడ అంత బాగుంటుందా? లేదా మన కళ్లకు కనిపిస్తున్నదంతా నాణేనికి ఒక వైపేనా.. రండి.. రెండో వైపు చూసి వద్దాం..   

నిజానికి సుదీర్ఘకాల స్పేస్‌మిషన్‌ల వల్ల చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లే వ్యోమగాములకు అక్కడ గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం, రేడియోధార్మికత కారణంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. 2022 కల్లా అంతరిక్షంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు ఉద్దేశించిన ‘గగన్‌యాన్‌’ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో అంతరిక్షంలో ఆరోగ్యపరంగా వ్యోమగాములు ఎదుర్కొనే ఇబ్బందులపై ఓ లుక్కేస్తే..

1 దృష్టి సమస్యలు
శరీరంలోని ద్రవాలు ప్రసరించి తలవైపు వస్తున్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది

2 గుండె
మెల్లిగా బలహీనమవుతుంది.ఆకారంలో మార్పులొస్తాయి.గుండె బరువు తగ్గుతుంది. గుండెకొట్టుకునే విధానంలో చాలా మార్పులొస్తాయి. 

3 మూత్రపిండాలు
క్యాల్షియం ఎక్కువ మొత్తంలో రక్తంలో కలవడం కారణంగా.. కిడ్నీలో రాళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

4 కండరాలు
5–11రోజుల అంతరిక్ష ప్రయాణంలో 20%వరకు కండరాలు బలహీన పడతాయి. 

5 వెన్నెముక
వెన్నెపూస దాదాపు 5 సెంటీమీటర్లు సాగేందుకు అవకాశం ఉంటుంది.

6 ఎముకలు
భూమిపై వృద్ధుల్లో ఏడాదికి ఎముకల బలహీనత 1.5% వరకు ఉంటుంది. అదే అంతరిక్షంలో నెలకు ఇది 1–1.5% ఉంటుంది.
- మిషన్‌ అనంతరం భూమిపైకి తిరిగొచ్చాక ఈ సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావం నుంచి వ్యోమగాములు బయటపడతారు.  

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

జగన్ గెలుపుకు అర్ధం..!

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ @మైదుకూరు

Watch Live: మైదుకూరులో సీఎం జగన్‌ ప్రచార సభ

Photos

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)