బాలుడిపై సామూహిక లైంగికదాడి

Published on Tue, 06/03/2014 - 22:10

న్యూఢిల్లీ: దుకాణానికి వెళ్లిన పదేళ్ల బాలుడిపై స్థానికంగా ఉన్న 8 మంది సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారని మంగళవారం పోలీసులు తెలి పారు. తూర్పు ఢిల్లీలోని గీత కాలనీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గత నెల 27వ తేదీన బాధిత బాలుడు ఒక దుకాణానికి వెళ్లాడు. అంతలో నిందితుల్లో ఒకడు బాలుడికి మాయమాటలు చెప్పి నతో తీసుకువెళ్లాడు. అనంతరం 8 మంది నిందితులు బాలుడిపై లైంగికదాడికి పాల్పడ్డారు. అంతేకాక తమ దుశ్చర్యను వీడియో తీశారు. విషయాన్ని ఎవరికైనా చెబితే తన ల్లిదండ్రులను చంపేస్తామని వారు బాలుడిని భయపెట్టడం తో అతడు జరిగిన ఘటనపై ఎక్కడా నోరువిప్పలేదు. అయితే బాలుడితో నిందితులు కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తుండటం గమనించిన బాలుడి అన్నయ్య విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు.

 వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుం డగా దుకాణం వద్ద ఒక నిందితుడిని బాలుడు గుర్తుపట్టాడు. దాంతో నిందితుడిని పట్టుకునేందుకు బాలుడి తండ్రి యత్నించగా, నిందితుడితోపాటు మరికొం దరు వారిపై దాడిచేశారు. దాంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే నిందితులు పారిపోయారు. నిందితులను జీవన్, దిలీప్,మనీష్, ఖేము, మోను, దేవి, పంచి, విక్రమ్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా లైంగిక దాడి జరిగిన మాట వాస్తవమేనని తేలింది. నిందితుల్లో ఒకడైన విక్రమ్‌ను అరెస్టుచేశామని, మిగిలినవారిని త్వరలో అరెస్టు చేస్తామని మంగళవారం డిప్యూటీ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ