మోదీ.. ఫేస్బుక్లో నెం 2, ట్విట్టర్లో నెం 3

Published on Wed, 11/19/2014 - 20:48

ప్రధాని నరేంద్రమోదీ మరో రికార్డు బద్దలుకొట్టారు. దేశ రాజకీయాల్లోనూ కాదు సోషల్ మీడియాలోనూ నరేంద్ర మోదీ హవా సాగుతోంది. ట్విట్టర్, ఫేస్బుక్లలో మోదీకి రికార్డు స్థాయిలో ఫాలోవర్లు పెరిగారు.

ఫేస్బుక్లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 2.5 కోట్లు దాటింది. ప్రపంచ రాజకీయ నాయకుల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తర్వాత ఫేస్బుక్లో తర్వాతి స్థానం మోదీదే. ఈ విషయాన్ని ఫేస్బుక్ యాజమాన్యం ప్రకటించింది. మోదీ క్రమేణా ఒబామా రికార్డుకు చేరువవుతున్నారు. జూలైలో మోదీ ఫాలోవర్ల సంఖ్య 1.8 కోట్లు ఉండగా, సెప్టెంబర్లో ఆ సంఖ్య 2.1 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం 2.5 కోట్లు దాటేసింది. ఫేస్బుక్లో ఒబామాను 4.3 కోట్ల మంది అనుసరిస్తున్నారు.

ఇక మోదీ ట్విట్టర్ ఖాతాను ఇప్పటికి 80 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్ల తర్వాత మూడో స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ యాజమాన్యమే ఓ ప్రకటనలో తెలిపింది. బరాక్ ఒబామాకు 4.3 కోట్ల మంది, పోప్ ఫ్రాన్సిస్కు 1.4 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. ఇటీవలి ఎన్నికల్లో మోదీ గెలిచినప్పటి నుంచి ట్విట్టర్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఎన్నికల్లో గెలిచినట్లు ఆయన చేసిన ట్వీట్ను మొత్తం 70,586 మంది రీట్వీట్ చేశారు. భారత దేశానికి సంబంధించి ఇది ఆల్టైం రికార్డు. ఆస్ట్రేలియా పర్యటన ముగింపు సమయంలో కూడా ఆ దేశ ప్రధాని టోనీ అబాట్తో కలిసి ఫొటో తీసుకుని దాన్ని ట్వీట్ చేశారు మోదీ.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ