ఏం చేస్తానో చూడండంటూ ఓ వృద్ధుడు!

Published on Thu, 11/23/2017 - 21:58

సాక్షి, ముంబై : సాధారణంగా తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. ఒక్కో దగ్గర బాధితులకు ఒక్కో అనుభవం ఎదురౌతుంది. తన ఫిర్యాదును పట్టించుకోలేదని తీవ్ర మనస్తాపానికి లోనైన ఓ వృద్ధుడు ఓ ఎత్తైన టవర్ ఎక్కి హడలెత్తించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో గురువారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. 67 ఏళ్ల ఓ వృద్ధుడు ముంబైలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఏదో సమస్య తలెత్తడంతో ఫిర్యాదు చేద్దామని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆయన సమస్యను పట్టించుకోని పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆ వృద్ధుడు ప్రియదర్శిని సర్కిల్ లో ఉన్న పవర్ టవర్ ఎక్కి.. కిందకి దూకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అతికష్టం మీద ఆ వ్యక్తిని కిందకి దించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.



Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ