ఈసారి ప్రత్యేకంగా సమావేశం..

Published on Thu, 12/19/2019 - 08:37

న్యూఢిల్లీ: వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఆరు నెలల్లో వివిధ మంత్రిత్వ శాఖలు సాధించిన పురోగతిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సమీక్షించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఆరు నెలల్లో తీసుకున్న నిర్ణయాలపై మంత్రిత్వ శాఖలు సంక్షిప్త ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నాయి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక రంగంపై ప్రధాని దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సాధారణంగా మంత్రి మండలి ప్రతి నెలా కేబినెట్‌ భేటీ తరువాత సమావేశం అవుతుంది. కానీ ఈసారి సమావేశం ప్రత్యేకంగా జరుగుతోంది.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏవిధంగా అమలు చేస్తున్నారనే దానిపై గత కొన్ని వారాలుగా ప్రధాని మోదీ సమీక్ష జరుతూనే ఉన్నారు. తాజా భేటీకి సహాయ మంత్రులు, సహాయ మంత్రులు(ఇండింపెడెంట్‌ చార్జీ) హాజరవుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రతివారం జరిగే కేబినెట్‌ సమావేశం ఈనెల 24న (మంగళవారం) జరుగుతుంది.రెండో పర్యాయం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు నవంబర్‌ నాటికి ఆరు నెలలు పూర్తి చేసుకుంది. (చదవండి: మోదీ చాలెంజ్‌ వెనుక అర్థమేంటి?)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ