amp pages | Sakshi

అందినకాడికి దండుకోవడమే..

Published on Mon, 08/11/2014 - 23:33

పింప్రి, న్యూస్‌లైన్ : అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌ల్లోనూ దండుకొంటున్నారు. రోగుల నుండి అత్యధికంగా చార్జీలను వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఫిట్‌నెస్‌లేని వాహనాలను వినియోగిస్తున్నా రు. కొన్ని అంబులెన్సుల్లో కనీస సౌకర్యాలు లేవు. సామాజిక, రాజకీయ పార్టీలనుండి అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేసి అంబులెన్స్ ప్రారంభిస్తున్న వారి ఆగడాలను అరికట్టే దిక్కులేకుండా పోయింది. ఇష్టమొచ్చినట్లు రోగుల బంధువుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆపదలో ఉన్న రోగులు, బంధువులుకూ ఇబ్బం దులు తప్పడం లేదు.

 తనిఖీలు నిల్
 ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల అంబులెన్సులల్లో వైద్య సదుపాయాలను ఆయా ఆస్పత్రిలే తనిఖీల ను చేస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్న అం బులెన్సులను ఎవరూ తనిఖీ చేయడం లేదు. ఒక్కో అంబులెన్సులో ఒక్కో ధరను వసూలు చేస్తున్నా యి. పుణే నగరంలో ప్రస్తుతం నడుస్తున్న అంబులెన్సులను పరిశీలిస్తే.. సంస్థల ద్వారా 288 అంబులెన్సులు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా- 326, కేంద్ర ప్రభుత్వం ద్వారా-11, శిక్షణ సంస్థల ద్వారా-8, స్వయం సేవా సంస్థల ద్వారా 110, స్థానిక సంస్థల ద్వారా-32, ఇతరులు-2 మొత్తం నగరంలో 1351 అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి.

 సౌకర్యాలు ఉండేవి..ఉండనివి..
 అంబులెన్సులు రెండు రకాలుగా వర్గీకరించారు. మొదటిది బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ వీటిలో ప్రత్యేక సదుపాయాలు ఉండవు. ఇవి కేవలం రోగులను తరలించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. రెండో రకం అంబులెన్సులల్లో సిలిండర్ , స్ట్రెక్చర్, ఈసీజీ మిషన్, సిరంజ్‌పంప్, డెఫ్రి బ్రిలేటర్ (హృదయ సంబంధించిన యం త్రం) బ్లడ్ ప్రెషర్ మిషన్, వెంటి లేటర్ సెక్షన్ మిషన్, నెబులైజర్, మాస్కులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, నర్సు, డాక్టర్లు, టెక్నీషియన్ ఉంటారని ససూన్ ఆస్పత్రి వైద్య పర్యవేక్షులు డాక్టర్ డి.బి.కులకర్ణి పేర్కొన్నారు.

 ఆర్టీవో పరిశీలనకు దూరం
 ఆర్టీవో ద్వారా అంబులెన్సుల వాహనంలో అన్ని మిషన్ విడిభాగాలను పరిశీలిస్తారు. భద్రతా పరం గా ఈ వాహ నం ఫిట్‌నెస్‌ను పరిశీలించి సర్టిఫికెట్‌ను ఆర్టీవో జారీ చేస్తుంది. ఇలా ప్రతి ఏడాది పరిశీ లి స్తోంది. ఇందుకు ప్రతి అంబులెన్స్ నుండి రూ.300 రుసుం వసూలు ఆర్టీవో అధికారులు వసూలు చేస్తా రు. ప్రస్తుతం నగరంలో సేవలందిస్తున్న 1,351 అంబులెన్సులకు  561 అంబులెన్సు లు ఆర్టీవో వద్ద తనిఖీలు జరపనే లేదు. 2012 తర్వాత ఒక్కసారి కూడా వీటిని పరిశీలించిన దాఖ లాలు లేవు. అంబులెన్సుల పనితీరును పరిశీలించడం తమ పని కాదని పుణే కార్పొరేషన్ ఆరోగ్య విభాగాధికారి డాక్టర్ ఎస్.టి.పరదేశీ తెలిపారు.

 ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలి : ఆర్టీవో
 ఈ విషయమై ఆర్టీవో అధికారి జితేంద్ర పాటిల్ మాట్లాడుతూ..ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోం, స్వయం సేవా సంస్థల ద్వారా మొత్తం 1,351 అంబులెన్సులు నడుస్తున్నాయన్నా రు. ఇందులో 790 అంబులెన్సులు ఫిట్‌నెస్ పరీక్ష లు చేయించుకున్నాయని, కొత్త అంబులెన్సులను ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి, పాత అంబులెన్సులను ప్రతి సంవత్సరం తప్పక పరిశీలించాల్సి ఉందన్నారు.   ఫిట్‌నెస్ పరీక్షలు తప్పకుండా జరుపుకోవాలని, లేకుంటే ఆ వాహనాన్ని అన్ ఫిట్ వాహనాలుగా ప్రకటిస్తామని తెలిపారు.

Videos

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)