కనుమరుగవుతున్న బాల్యం

Published on Thu, 05/25/2017 - 01:32

రెండు తెలుగు రాష్ట్రాలలో సరాసరి వారానికి ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోతున్నారని అధికారిక గణాం కాలు చెబుతున్నాయి. వీరిలో అప్పుడే పుట్టిన పిల్లల దగ్గరి నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల వరకు ఉంటున్నారు. తప్పిపోయిన వాళ్లలో 33 శాతం పిల్లలు తిరిగి తమ వారి వద్దకి చేరుకుంటుండగా 21 శాతం పిల్లలు శవాలుగా లభ్యమౌతున్నారు.

పిల్లలు ఇంత భారీ సంఖ్యలో కనిపించకుండా పోతున్న కారణాలు చూస్తే, ప్రభుత్వ దవాఖానాల్లో పసిగుడ్డులను పనిగట్టుకొని తల్లి పొత్తిళ్లనుంచి ఎత్తుకపోయి ఆ పిల్లలను అంగడి సరుకుల్లా పట్టణాల్లో అమ్మివేస్తున్నారు. ఇక పెద్దలపై ఉన్న పగా, ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎత్తుకెళ్లడం, సంపన్నుల పిల్లలను కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయడం పరిపాటిగా మారింది.

6 నుంచి 12 ఏళ్ల పిల్లలను సంతల్లో, జాతరల్లో, రద్దీ ప్రదేశాల నుంచో తల్లి ఆదమరచి ఉన్న సమయంలో ఎత్తుకెళ్లి, యాచకుల మాఫియా వారిని యాచకులుగా చేసి బిచ్చం ఎత్తించడం చూస్తున్నాం. ఇక పెద్ద పిల్లలైతే ఇళ్లలో వేధింపులు, సవతి తల్లి లేదా సవతి తండ్రి అఘాయిత్యాలను తాళలేక పారి పోయి యాచకులుగానో, బాల కార్మికులుగానో జీవిం చడం లేదా సంఘ వ్యతిరేక  ముఠాల బారిన పడి మత్తు పదార్థాల అక్రమ రవాణాలోనో, వ్యభిచార గృహాల్లో, దొంగలుగానో దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇలాంటి వారు కళ్లముందే కనిపిస్తున్నా వారి గురించి ఆరా తీయకపోవడం పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా చెప్పుకోవచ్చు.

పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఒక బంగారు గొలుసు లేదా పర్సు పోయిందని ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారునికి ఇచ్చిన ప్రాధాన్యత పిల్లలు కన్పించకుండా పోయారన్న విషయంలో ఇవ్వడం లేదు. దేశ భావి పౌరులైన పిల్లలను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కనీస చర్యలు కూడా చేపట్టకపోవటం గర్హనీయం.

పిల్లలు తప్పిపోయి అనంతరం ప్రాణాలు కోల్పోవడమో, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పడటమో, అమ్మకానికి గురికావడమో, మాఫియాల చేతుల్లో దుర్భర జీవితాన్ని కొనసాగించడం కట్టడి చేయాలంటే ఎలాంటి పంచవర్ష ప్రణాళికలు అక్కర లేదు. కేవలం పిల్లల్ని, పిల్లలుగా చూస్తే చాలు. రోడ్లపై ఉన్న పిల్లలని చూసి కనుగొని ముందుగా ఆశ్రమాలకు చేర్చి అనంతరం అమ్మానాన్నలకు అప్పగించవచ్చు. అలాగే పిల్లలు తప్పిపోయినారనే ఫిర్యాదు వచ్చిన వెంటనే అత్యంత ప్రాధాన్యతాంశంగా ఓ ప్రాణం కాపాడాలన్న సంకల్పంతో, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పోలీసులు పరిశోధన, దర్యాప్తు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

బాలకార్మిక అక్రమ తరలింపును అరికట్టడానికి కార్మిక శాఖ నిరంతరం నిజాయితీగా పనిచేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగానికి పిల్ల లను రక్షించాలనే సంకల్పం ఉండాలి. వారికి ఈ బాధ్యత ఉండాలంటే ప్రభుత్వాలు కేవలం ఓటర్ల వైపే కాకుండా పిల్లలపై సైతం దృష్టి పెట్టాలి.

(నేడు వరల్డ్‌ మిస్సింగ్‌ చిల్డ్రన్స్‌ డే)
అచ్యుతరావు, గౌరవ అధ్యక్షులు,
బాలల హక్కుల సంఘం ‘ 93910 24242

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)