ప్రశ్నోత్తరాల సమయం లేదా?

Published on Wed, 07/04/2018 - 12:04

సాక్షి బెంగళూరు: విధాన పరిషత్తులో ప్రశ్నోత్తరాల సమయం తీసివేయడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ ఆరంభంలోనే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడం ఏంటని బీజేపీ సభ్యులు అరుణ్‌శాహపుర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా రఘునాథ్‌ మల్కాపుర కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జేడీఎస్‌ సభ్యులు శరవణ, భుజేగౌడ స్పందిస్తూ మల్కాపుర వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించరాదని సూచించారు.

ఈసందర్భంగా సభాపతి బసవరాజు హొరట్టె కల్పించుకుని మాట్లాడారు. పరిషత్తు సజావుగా సాగడానికి సహకరించాలని కోరారు. సభాపతి అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడకూడదన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ఉంటే సభ్యులు ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడంతో సమావేశం నడిచేందుకు సహకరించాలని కోరారు. కాగా ప్రశ్నోత్తరాల సమయం లేదనే విషయం ముందే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమయం లేకపోవడంతో ప్రశ్నోత్తరాలు తొలగించారని సభాపతి బసవరాజు హొరట్టె స్పష్టం చేశారు.

అయితే రానున్న రోజుల్లో ప్రశ్నోత్తరాల సమయం తప్పకుండా నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు కోటా శ్రీనివాస్‌ పూజారి మాట్లాడుతూ సభ్యుల ఆధారంగా సమావేశం జరగాలన్నారు. అనంతరం మంత్రి యూటీ ఖాదర్‌ మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయం ఉండాలని తాను కూడా ఒప్పుకుంటున్నానన్నారు. అయితే అనివార్య కారణాల రీత్యా ప్రశ్నోత్తరాల గంట లేదన్నారు. ప్రభుత్వం, అధికారుల చేతకాని తనం వల్లే ప్రశ్నోత్తరాల గంట తీసివేశారని సభాపతి బసవరాజు హొరట్టె విమర్శించారు.
 
అనుచరులకు ప్రవేశం బంద్‌

విధాన పరిషత్తు సభ్యుల గన్‌మెన్‌లు, అనుచరులు, వ్యక్తిగత కార్యదర్శులకు ప్రవేశం లేదని సభాపతి బసవరాజు హొరట్టె హెచ్చరించారు. ఈమేరకు విధాన పరిషత్తు ద్వారం వద్ద మార్షల్స్‌ను నియమించారు. వారి సభ్యులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. సభాపతి ఆదేశాలు అని చెప్పుకొచ్చారు. దీంతో గన్‌మెన్లు, అనుచరులు బయటే ఉండిపోయారు. ఈసందర్భంగా కొత్త సభ్యులను సభాపతి పరిచయం చేశారు.

Videos

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)