కాంగ్రెస్‌కు మాజీమంత్రి గుడ్‌బై

Published on Thu, 11/15/2018 - 05:18

సాక్షి, వికారాబాద్‌: తన అనుచరులు, అభిమా నుల ఆకాంక్షల మేరకే తాను స్వతంత్ర అభ్య ర్థిగా బరిలోకి దిగుతున్న ట్లు మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలం గాణ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లాలో తానే మొట్టమొదటగా పాల్గొ న్నానని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశానన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత ఏఐసీసీ అధి నేత్రి సోనియాగాంధీనేనని, ఆమెకు ఢిల్లీ వెళ్లి కృతజ్ఞతలు కూడా తెలిపాన న్నారు. వికారాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడం తో నిరాశ చెంది ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా సమర్పించినట్లు తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ