‘బాబు లేఖలో పేర్కొన్నవన్నీ అసత్యాలు’

Published on Tue, 04/28/2020 - 12:46

సాక్షి, అమరావతి: ఇంటో కూర్చొని చంద్రబాబు దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎవరో తన తాబేదారుడు రాసిన లేఖపై చంద్రబాబు సంతకం చేసినట్లు ఉందని ఆయన విమర్శించారు. శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు లేఖలో పేర్కొన్నవి అన్ని అబద్ధాలే అని అన్నారు. ఆ లేఖలో ఉపయోగపడే అంశాలు ఏమి లేవని ఆయన విమర్శించారు. బాబు ఆయన కుమారుడు హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. బాబు అవగాహన లేకుండా రైతుల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతారని ఆయన అన్నారు. బాబు హైదరాబాద్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలను లాక్‌డౌన్ పాటించమని చెపుతున్నాడని కానీ ఆయన కుమారుడు రోడ్లు మీద షికార్లు చేస్తున్నాడని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కనీసం మొహానికి మాస్క్ కూడా లోకేష్ ధరించలేదన్నారు.

చంద్రబాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ అని, శవాలు మీద పేలాలు ఎరుకొనే రకం టీడీపీ నేతలని శ్రీకాంత్‌ విమర్శించారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లును ప్రభుత్వం పారదర్శకంగా కొనుగోలు చేసిందని తెలిపారు. నాయకత్వం అంటే బిల్డప్‌లు ఇవ్వడం కాదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పాత ఫొటోలతో ప్రజలను  బాబు మభ్యపెడుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా ఫీజ్ రియంబర్స్ మెంట్‌కు రూ. 4 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.రాష్ట్రాన్ని బాబు అప్పుల ఉబిలోకి నెట్టారని విమర్శించారు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. కరోనా నివారణలో దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఆయన గుర్తు చేశారు.

వైస్సార్‌సీపీ నాయకులు అనేక సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ఆలాంటి నేతలు వల్లనే కరోనా వచ్చిందని మాట్లాడడం చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమని శ్రీకాత్‌రెడ్డి మండిపడ్డారు. దళితుడైన కనగరాజును ఎన్నికల కమిషనర్‌గా నియనిస్తే చంద్రబాబు తట్టుకోలేక ఆయన వలన గవర్నర్ కార్యాలయంలో కరోనా వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్‌ ఆగ్రహించారు. ప్రధానమంత్రి వలన దేశంలో కరోనా వచ్చిందని విమర్శలు చేయగలవా చంద్రబాబు అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కరోనా వస్తే చనిపోతారని ప్రజలను భయపెడితే.. కరోనా వస్తే చనిపోరని సీఎం జగన్‌ ప్రజలకు ధైర్యం చెపుతున్నారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి కానీ దానికి భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.బాబు పక్క రాష్టంలో దాక్కొని విమర్శలు చేస్తున్నారని, ప్రజలపై అభిమానం ఉంటే బాబు రాష్ట్రానికి రావాలని శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ