రైల్లో మంత్రి బ్యాగు చోరీ.. మోదీనే కారణం!

Published on Thu, 09/19/2019 - 15:22

రాయ్‌పూర్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఛత్తీస్‌గఢ్‌ విద్యాశాఖ మంత్రి ప్రేమసాయి సింగ్‌ టేకమ్‌ విచిత్రమైన ఆరోపణలు చేశారు. రైల్వేలో దొంగతనాల వెనుక ప్రధాని మోదీ ఉన్నారని ఆరోపించారు. రెండోరోజుల కిందట అమర్‌కంటక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో జరిగిన చోరీ ఘటనలో మంత్రి టేకమ్‌ బ్యాగు పోయింది. దీంతో ఆయన ఏకంగా మోదీని చోరీలు చేయిస్తున్నారంటూ విడ్డూరమైన ఆరోపణలు చేశారు.

‘మోదీజీ రైళ్లలో చోరీలు చేయిస్తున్నారు. మంత్రుల బ్యాగులను కొట్టేస్తున్నారు. ఆయన ప్రభుత్వం సాధించిన ఘనత ఇది’ అని టేకమ్‌ చెప్పుకొచ్చారు. మోదీ సర్కారు వందరోజుల పాలనను, రైళ్లలో దొంగతనాలతో ముడిపెట్టి ఆయన వ్యాఖ్యలు చేశారు. అమర్‌కంటక్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్‌క్లాస్‌ కోచ్‌లో ప్రయాణిస్తున్న టేకమ్‌ బ్యాగును దొంగలు కొట్టేసినట్టు కథనాలు వచ్చాయి. ఆయన బ్యాగులో నగదుతోపాటు విలువైన పత్రాలు ఉన్నట్టు సమాచారం.


 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ