ఉగాది పచ్చడిలా టీఆర్‌ఎస్‌ పాలన: పొంగులేటి

Published on Sat, 06/02/2018 - 02:29

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ పాలన ఉగాది పచ్చడిలా ఉందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి చేయాల్సింది ఇంకా చాలా ఉందని, అభివృద్ధిలో ప్రభుత్వం ప్రతిపక్షాలను కలుపుకునిపోవాలని సూచించారు.

రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లైనా నీటి సమస్య తీరలేదని పేర్కొన్నారు. రైతులకు మేలు చేయాలంటే రైతు బంధు పథకం సరిపోదని, పంటలకూ గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.

నగరమంతా పాదయాత్ర చేస్తా: అంజన్‌ కుమార్‌
సాక్షి,హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు పూర్వ వైభ వం తెచ్చేందుకు త్వరలో హైదరాబాద్‌ అంతటా పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. శుక్ర వారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.

ప్రజాసమ స్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. పార్టీ నగర అధ్యక్షుడిగా నియమించినందుకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి వంద సీట్లు గెలిచిందని ఆయన ఆరోపించారు. దళితులకు మూడెకరాలు, పేదలకు ‘డబుల్‌’ ఇళ్లు  హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ