తెలుగుదేశం పాలనలో దళితులకు రక్షణ కరువు

Published on Mon, 02/25/2019 - 12:59

కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట అర్బన్‌: తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆందోళన వ్యక్తంచేశారు. మండలంలోని అనుమంచిపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలను తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధితో కలిసి ఉదయభాను ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉదయభాను మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులు తీవ్ర అవమానాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడటం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రభుత్వ విప్‌గా ఉన్న చింతమనేని ప్రభాకర్‌ దళితులను కించపరిచేలా మాట్లాడినా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

చింతమనేని దౌర్జన్యాలకు అంతం లేకుండా పోయిందని, కనీసం ఆయనపై చర్యలు తీసుకోవడానికి కూడా సీఎం ప్రయత్నించకపోవడం ఆయన చేతగాని తనాన్ని, దళితులపై ఆయనకు ఉన్న గౌరవం ఏమిటో తెలియజేస్తోందన్నారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ నాటి పాలన రావాలంటే ఒక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రక్షణనిధి మాట్లాడుతూ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లే  అట్టడుగున ఉన్న దళితులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని స్పష్టం చేశారు. జగ్జీవన్‌రామ్‌ దళితుల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, జిల్లా పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ యువ నాయకుడు సామినేని ప్రశాంత్‌బాబు, మాజీ ఎంపీపీ మాతంగి వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్‌ నాయకులు పగిడిపల్లి సునిల్‌కుమార్, తుమ్మల ప్రభాకర్, బూడిద నరసింహారావు, మార్కపూడి గాంధీ, పాతకోటి ఉదయభాను, ఆకారపు వీరాస్వామి  తదితరులు పాల్గొన్నారు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)