‘ సోషల్‌ మీడియా సామాన్యుల గొంతుక కానీ..’

Published on Sat, 06/30/2018 - 20:26

సాక్షి, న్యూఢిల్లీ : సామాన్యుల ఆలోచనలు వ్యక్తపరచడానికి, నైపుణ్యాలను ప్రదర్శించడాని సోషల్‌ మీడియా ఓ చక్కటి వేదిక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.  ప్రపంచ సోషల్‌ మీడియా డే( జూన్‌30) శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. ‘యువకులకు సోషల్‌ మీడియా డే శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య దేశంలో సోషల్‌ మీడియా ముఖ్యపాత్ర పోషిస్తోంది.

ఇది సామాన్యులు గొంతుక. కోట్లాది మంది సామాన్యులు తమ అభిప్రాయాలను వెల్లడించానికి అవకాశం ఇచ్చింది. పద్దతిగా మంచి కోసం ఉపయోగిస్తే సోషల్‌ మీడియా ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి. కానీ చెడు కోసం ఉపయోగిస్తే అంతే స్థాయిలో నష్టం కూడా ఉంది. యువకుల్లారా బాధ్యతాయుతంగా సోషల్‌ మీడియా ద్వారా స్వేచ్ఛగా మీ భావాలను ,నైపుణ్యాలను వెల్లడించండి’ అంటూ ట్వీట్‌ చేశారు. 

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రామన్‌ సింగ్‌ కూడా ప్రపంచ సోషల్‌ మీడియా డే శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు సోషల్‌ మీడియా ఒక ఉప్పెనలా దూసుకెళ్తోంది. సామాన్యుడు తన భావాలను వ్యక్త పరచడానికి చక్కటి వేదికైంది. సమాజంలో సానుకూల ప్రభావాన్ని కల్పించేందుకు వీలుగా ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా ఈ సాధనాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను’ అని సింగ్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ