సాగు నీటి కోసం పోరాటం

Published on Mon, 03/12/2018 - 11:15

వెలుగోడు: సాగునీటి కోసం  పోరాటం చేస్తానని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు.  రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులన్నీ  90 శాతం పూర్తి చేశారన్నారు. గాలేరు నగరి, మల్యాల ఎత్తిపోతల పథకం, అలగనూరు రిజర్వాయర్, పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కుల సామర్థ్యం పెంచేందుకు వైఎస్‌ఆర్‌ కృషి చేశారని గుర్తు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మిగిలిన పనులు పూర్తి చేయడం లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి రైతును అని చెప్పుకుంటూ అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 7 టీఎంసీల ఉంటే మార్చి ఆఖరి వరకు సాగునీరు ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేసినట్లే అన్నారు. ఒక ఎకరా కూడా రెండో పంట ఎండిపోకుండా వీబీఆర్‌ నుంచి మే చివరి వరకు నీరందించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పది వేల మంది రైతులతో పాదయాత్ర చేస్తానని హెచ్చరించారు. టీడీపీ నేతలు కాంట్రాక్టు పనులు చేసుకొని రైతుల కడుపు కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా కల్పించారు. తాను గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు వీబీఆర్‌లో డెడ్‌ స్టోరేజీ ఉన్న సమయంలో కూడా వన్‌ఆర్, వన్‌ ఎల్‌ తూముల నుంచి రైతులకు నీరందించానని గుర్తు చేశారు.  

సిద్ధాపురానికి తరలిరండి
సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వద్ద ఈ నెల ఆఖరున లేదంటే వచ్చే నెలలో నిర్వహించే వైఎస్‌ఆర్‌ జలహారతి కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి సిద్ధాపురం చెరువు వద్దకు ట్రాక్టర్ల మీద తరలిరావాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అంబాల ప్రభాకర్‌రెడ్డి, తిరుపంరెడ్డి, మండ్ల శంకర్‌రెడ్డి, పెద్ద స్వామన్న, వంగాల నాగేశ్వరరెడ్డి, నడిపి స్వామన్న, శ్రీనివాసులు, భూపాల్‌చౌదరి పాల్గొన్నారు. 

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)