నీ హద్దులు దాటొద్దు: పాక్‌ క్రికెటర్‌ ఫైర్‌

Published on Mon, 11/26/2018 - 14:44

దుబాయ్‌ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్తాన్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌ (127) సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడుగా హరీష్‌ సోహైల్‌ (148) రాణించడంతో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ను 418 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది. కెరీర్‌లో తొలి టెస్ట్‌ సెంచరీ సాధించిన బాబర్‌ అజమ్‌పై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌, యాంకర్‌ జైనాబ్‌ అబ్బాస్‌.. బాబర్‌ను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్‌ అతనికి చిర్రెత్తుకొచ్చింది.

వెంటనే ఈ ట్వీట్‌పై బాబర్‌ స్పందిస్తూ.. ‘ఎదైనా చెప్పాలనుకునే ముందు ఒకసారి ఆలోచించు. నీ హద్దులు దాటడానికి ప్రయత్నించవద్దు’ అని ఘాటుగా బదులిచ్చాడు. ఇంతకీ ఆ యాంకర్‌ ఏమన్నదంటే.. ‘బాబర్‌ అజమ్‌ అద్భుతంగా ఆడాడు. మిక్కీ ఆర్థర్‌ తన కొడుకు సెంచరీని ఆస్వాదిస్తున్నాడు’ అని ట్వీట్‌ చేసింది. ఇదే బాబర్‌కు ఆగ్రహం తెప్పించింది. దక్షిణాప్రికా మాజీ క్రికెటరైన మిక్కీ అర్థర్‌ పాక్‌ జట్టు ప్రస్తుత కోచ్‌ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్వీట్‌ను బాబర్‌ తప్పుగా అర్థం చేసుకున్నాడని కొందరు.. జైనాబ్‌ అబ్బాస్‌ది తప్పేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తొలి టెస్ట్‌లో అనూహ్య పరాజయం పొందిన పాక్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ