జింఖానా సందడి సందడిగా

Published on Mon, 02/06/2017 - 08:10

సాక్షి, హైదరాబాద్: చాలా కాలం తర్వాత జింఖానా మైదానంలో కళ కనిపించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లే కాకుండా రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు కూడా చాలా వరకు ఉప్పల్ స్టేడియానికే పరిమితం అవుతుండటంతో జింఖానాలో ప్రధాన మ్యాచ్‌లు కూడా ఏవీ జరగడం లేదు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇక్కడ రంజీ మ్యాచ్ జరిగాక ఎక్కువ సార్లు అండర్-19, అండర్-23 స్థాయి పోటీలకే ఈ గ్రౌండ్ పరిమితమైంది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చారు. స్టార్ ఆటగాళ్లు లేకపోయినా కొన్ని తెలిసిన పేర్లు ఉన్న అంతర్జాతీయ జట్టు మ్యాచ్ ఆడుతుండటమే అందుకు కారణం.

 

ఎన్ని ఏళ్లు గడిచినా మారని తరహాలో పాత రోజుల్లాగే జనమంతా బౌండరీ బయట ఇనుప ఫెన్సింగ్ వెనక నిలబడి ఆటపై తమ ఆసక్తిని ప్రదర్శించారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో ప్రేక్షకుల నుంచి తమీమ్, ముష్ఫికర్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. భారత జట్టు సభ్యులైన హార్దిక్ పాండ్యా, జయంత్ బౌలింగ్, పంత్ కీపింగ్ చేస్తున్న సమయంలో కూడా వారు బాగా ప్రోత్సహించారు. భారత జట్టు బ్యాటింగ్ సమయంలో తొలి వికెట్ పడిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాడి పేరు స్కోరుబోర్డుపై పొరపాటున హార్దిక్ పాండ్యాగా పడింది. దాంతో పాండ్యా సిక్సర్, సిక్సర్ అంటూ వారంతా పెద్దగా అరిచారు. అయితే బ్యాటింగ్‌కు వచ్చింది శ్రేయస్ అని గుర్తించేందుకు కాస్త సమయం పట్టింది. మరోవైపు సివిల్ సప్లయిస్ విభాగం కమిషనర్ సీవీ ఆనంద్... తమ కుమారుడు మిలింద్ బౌలింగ్‌ను ఆసాంతం చూస్తూ ఆట ముగిసే దాకా గ్రౌండ్‌లోనే ఉన్నారు.


 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ