amp pages | Sakshi

‘ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను మళ్లీ చూసినట్టుంది’

Published on Tue, 04/02/2019 - 19:07

హైదరాబాద్‌: సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అనూహ్యంగా పరాజయం చవిచూసిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా ఢిల్లీ ఫ్యాన్స్‌, మాజీ ఆటగాళ్లు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్ల ఆటతీరుపై మండిపడుతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఢిల్లీ జట్లుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ను చూసినట్టుంది’అంటూ సెటైర్‌ వేశారు. ఇక ముఖ్యంగా యువ సంచలనం రిషభ్‌ పంత్‌ నిర్లక్ష్యంగా ఆడుతున్నాడని..  చివరి వరకు ఉండి జట్టును ఎలా గెలిపించాలో ధోనిని చూసి నేర్చువాలంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఢిల్లీ మాత్రమే ఫైనల్‌కు చేరలేదు. అయితే ఈ సీజన్‌లో కొత్త జెర్సీ. జట్టు పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ జట్టు ఆటతీరు మారలేదంటూ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్‌)-12లో భాగంగా సోమవారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమి చవిచూసింది. ఢిల్లీ విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 30 పరుగులు కావాలి. అప్పటికి చేతిలో  ఏడు వికెట్లు ఉన్నాయి. దాంతో ఢిల్లీ విజయం ఖాయమనుకున్నారు. ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న రిషభ్‌ పంత్‌-ఇన్‌గ్రామ్‌లు కుదురుగా ఆడుతున్నారు. అయితే జట్టు స్కోరు 144 పరుగుల వద్ద ఉండగా రిషభ్‌ పంత్‌ బౌల్డ్‌ అయ్యాడు. షమీ వేసిస 17 ఓవర్‌ మూడో బంతికి  సిక్సర్‌ కొట్టి మంచి దూకుడుగా కనిపించిన పంత్‌..ఆ మరుసటి బంతికి బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ పతనం మొదలైంది. ఎనిమిది పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ పరాజయం చెందింది.  అద్భుత బౌలింగ్‌తో హ్యాట్రిక్‌ సహా నాలుగు వికెట్లు తీసిన సామ్‌ కరన్‌ ఢిల్లీ  పతనాన్ని శాసించాడు.

చదవండి: 
‘8 పరుగులకే 7 వికెట్లు అంటే నమ్మశక్యంగా లేదు’
మరిన్ని విజయాలు సాధిస్తాం
సామ్‌ కరన్‌ హ్యాట్రిక్‌

Videos

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)