ఆరంభం అదిరినా.. చివర్లో బ్యాట్లెత్తేశారు

Published on Fri, 05/23/2014 - 17:37

ముంబై: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శుక్రవారం మధ్యాహ్నం ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై 19.3 ఓవర్లకు 173 పరుగులకు ఆలౌటైంది. ముంబై ఆరంభంలో అద్భుతంగా ఆడినా చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.

ఓపెనర్లు సిమ్మన్స్, మైకేల్ హస్సీ జట్టుకు అద్భుత ఆరంభాన్నిచ్చారు. సిమ్మన్స్ (35), హస్సీ (56) తొలి వికెట్కు 8 ఓవర్లలోనే 87 పరుగులు జోడించారు. సిమ్మన్స్ అవుటయినా హస్సీ.. రోహిత్ శర్మ (30)తో కలసి ఇదే జోరు కొనసాగించాడు. రన్రేట్ పదికి తగ్గకుండా పరుగులు సాధించారు. దీంతో ముంబై స్కోరు సునాయాసంగా 200 దాటడం ఖాయమనిపించింది. కాగా 15 వ ఓవర్లో ఢిల్లీ బౌలర్ ఉనాద్కట్ విజృంభించి ముంబై జోరును అడ్డుకున్నాడు. 140/2 స్కోరు వద్ద రోహిత్ను బౌల్డ్ చేసిన ఉనాద్కట్.. ఇదే ఓవర్లో పొలార్డ్ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత అంబటి రాయుడు, తరె, హర్భజన్, డి లాంగ్ పెవిలియన్కు క్యూ కట్టడంతో పరుగుల వేటలో ముంబై జోరు తగ్గింది. మరో మూడు బంతులు మిగిలుండగా ముంబై ఆలౌటైంది. ముంబై 33 పరుగుల తేడాతో చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది. దీంతో స్కోరు 180 కూడా దాటలేకపోయింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ