మొమోటా సిక్సర్‌...

Published on Mon, 07/29/2019 - 10:02

టోక్యో: ఏడాది కాలంగా అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న జపాన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ కెంటో మొమోటా ఈ సీజన్‌లో ఆరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సొంతగడ్డపై ఆదివారం ముగిసిన జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ మొమోటా టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్‌ అయిన కెంటో మొమోటా 21–16, 21–13తో ఆరో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)పై అలవోకగా గెలుపొందాడు.

44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌ లో మొమోటాకు ఏ దశలోనూ క్రిస్టీ పోటీనివ్వలేకపోయాడు. విజేత మొమోటాకు 52,500 డాలర్ల (రూ. 36 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11,000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది తొమ్మిది టోర్నీల్లో పాల్గొన్న మొమోటా ఆరు టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచాడు. జపాన్‌ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్, సింగపూర్‌ ఓపెన్, ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్, జర్మన్‌ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్‌ టోర్నీల్లో మొమోటా టైటిల్స్‌ సాధించాడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ