అఫ్ఘాన్ మరో సంచలనం

Published on Fri, 01/08/2016 - 01:02

జింబాబ్వేపై రెండోసారి సిరీస్ విజయం
  ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి ప్రవేశం

 షార్జా: అఫ్ఘానిస్తాన్ వన్డే జట్టు మరో సంచలనం సృష్టించింది. వరుసగా రెండోసారి జింబాబ్వేపై సిరీస్ విజయం సాధించింది. ఫలితంగా తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లో స్థానం దక్కించుకుంది. బుధవారం జరిగిన చివరి వన్డేలో విజయం ద్వారా జింబాబ్వేతో సిరీస్‌ను అఫ్ఘాన్ జట్టు 3-2తో చేజిక్కించుకుంది. తొలుత జింబాబ్వే 49.5 ఓవర్లలో 248 పరుగులు చేసింది. మసకద్జ (111 బంతుల్లో 110; 9 ఫోర్లు; 4 సిక్సర్లు) సెంచరీ చేశాడు.  హమ్జాకు మూడు వికెట్లు దక్కాయి. అఫ్ఘానిస్తాన్ 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు చేసి గెలిచింది. గుల్బదిన్ నబీ (68 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు; 6 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య రెండు టి20ల సిరీస్ ప్రారంభమవుతుంది.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ