పాకిస్తాన్ టి-20 టీమ్కు కొత్త కెప్టెన్

Published on Tue, 04/05/2016 - 13:42

కరాచీ: పాకిస్తాన్ టి-20 క్రికెట్ జట్టు కెప్టెన్గా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ సర్ఫ్రాజ్ అహ్మద్ను నియమించారు. పాక్ వన్డే జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న సర్ఫ్రాజ్కు పొట్టి ఫార్మాట్లో షాహిద్ అఫ్రీది స్థానంలో జట్టు పగ్గాలు అప్పగించారు. మంగళవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ మేరకు ప్రకటించింది. టి-20 ప్రపంచ కప్లో వైఫల్యం అనంతరం పాక్ టి-20 కెప్టెన్గా అఫ్రీది వైదొలిగిన సంగతి తెలిసిందే.

కెప్టెన్సీ మార్పు గురించి సర్ఫ్రాజ్తో మాట్లాడానని, కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాలని సూచించినట్టు పీసీబీ చైర్మన్ షహర్యర్ ఖాన్ చెప్పాడు. కొత్త బాధ్యతల్లో రాణించాలంటూ అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 28 ఏళ్ల సర్ఫ్రాజ్  21 టెస్టులు, 58 వన్డేలు, 21 టి-20 మ్యాచ్లు ఆడాడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ