కాంగ్రెస్ జోరు.. బీజేపీ బేజారు

Published on Tue, 01/12/2016 - 11:06

- మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
- నాలుగో స్థానానికి పడిపోయిన అధికార బీజేపీ
- రెండు, మూడో స్థానాల్లో ఎన్సీపీ, శివసేన

ముంబై:
మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో అధికార బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది. రాష్ట్రంలోని ఏడు నగర పంచాయితీలు, ఒక కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల పూర్తి ఫలితాలు మంగళవారం ఉదయం వెలువడ్డాయి. మొత్తం 345 వార్డులకుగానూ కాంగ్రెస్ 105 వార్డుల్ని గెలుచుకుని సత్తాచాటింది. 80 వార్డుల్లో విజయం సాధించిన ఎన్సీపీ రెండో స్థానంలో, 59 చోట్ల గెలిచిన శివసేన మూడోస్థానంలో నిలిచాయి. బీజేపీ కేవలం 39 స్థానాలకే పరిమితమై పరువు పోగొట్టుకుంది.

చాలా కాలం తర్వాత సొంతగా పోటీచేసి, విజయం సాధించడంతో మహారాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. బీజేపీ- శివసేన సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారనేందుకు నిదర్శనమే ఈ ఫలితాలని ప్రతిపక్ష నేత విఖే పాటిల్ అన్నారు. అధికారంలో ఉండికూడా మున్సిపల్ ఎన్నికల్లో ఘర ఓటమి బీజేపీ శ్రేణుల్ని కలవరపాటుకుగురిచేసింది. తాజా ఫలితాలతో ఊపుమీదున్న కాంగ్రెస్ శ్రేణులు జనవరి 15, 16న ముంబై పర్యటనకు రానున్న రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నద్ధులవుతున్నారు.

రాయ్ గఢ్, నందూర్బర్, అహ్మద్ నగర్, నాందేడ్, ఉస్మానాబాద్, హింగోలి, వషీం నగర పంచాయితీలతోపాటు చంద్రాపూర్ కౌన్సిల్ కు గత వారంలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ లో 59 నగర పంచాయితీలు, ఒక కౌన్సిల్ క జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యథిక స్థానాలు కౌవసం చేసుకుంది. అప్పుడు రెండో స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ మంగళవారంనాటి ఫలితాల్లో అనూహ్యంగా బలం పుంజుకుంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ