amp pages | Sakshi

ప్రశాంతంగా టెట్

Published on Sat, 08/17/2013 - 23:49

 సాక్షి, చెన్నై: ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే వారికి టెట్ తప్పనిసరి చేస్తూ కేంద్రం సరికొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ క్రమంలో టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నం గందరగోళం మధ్య సాగింది. పరీక్ష నిర్వహణ తేదీ పలుమార్లు వారుుదా పడింది. ఎట్టకేలకు పరీక్ష జరిగినా అభ్యర్థుల విద్యార్హతతో సంబంధం లేని ప్రశ్నలు ఇవ్వడం, 150 ప్రశ్నలకు గంటన్నర మాత్రమే సమయం కేటాయించడం విమర్శలకు దారి తీసింది. ఫలితంగా పరీక్ష రాసిన ఆరు లక్షల ప్రశాంతంగా టెట్
 మందిలో రెండు వేల మందే ఉత్తీర్ణులయ్యూరు. దీంతో మూడు గంటల సమయాన్ని నిర్ణయించి మళ్లీ పరీక్షలు నిర్వహించి ఖాళీల్ని భ ర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది పకడ్బందీ టెట్ నిర్వహించేందుకు ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్ బోర్డు చర్యలు తీసుకుంది. శనివారం పేపర్ 1(డీఎడ్), ఆదివారం పేపర్ 2(బీఎడ్) పరీక్ష జరగనున్నట్లు ప్రకటించింది.
 
 నిఘానీడలో పరీక్ష
 శనివారం తొలి పేపర్ పరీక్ష ప్రశాంతంగా సాగింది. అత్యంత కట్టుదిట్టమైన నిఘానీడలో పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉదయూన్నే చేరుకున్నారు. పది నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. రాష్ట్రంలోని 677 కేంద్రాల్లో 2.67 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. చెన్నైలోని కేంద్రాల్లో 50 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వీరిలో మహిళా అభ్యర్థులు అధికం. ఆదివారం బీఎడ్ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. సుమారు 4.11 లక్షల మంది పరీక్ష రాయనున్నారు.  
 
 లీక్ కలకలం
 టెట్ పేపర్ ధర్మపురిలో లీక్ అరుునట్లు వచ్చిన సమాచారం అభ్యర్థులు, అధికారులను ఆందోళనలో పడేసింది. ధర్మపురిలో ఓ ముఠా పేపర్ లీక్‌కు పాల్పడినట్లు, ప్రశ్నపత్రాలను వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఓ చోట అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళుతున్న సమయంలో ఈ ప్రచారం మొదలైంది. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రచారం బయలుదేరిన పరీక్ష కేంద్రం వద్ద నుంచి విచారణ వేగవంతం చేశారు. ధర్మపురి ఎస్పీ అష్రాకార్గ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కృష్ణగిరి సరిహద్దుల్లో తనిఖీలు వేగవంతం చేశారు. ఆ సరిహద్దుల్లో ఐదుగురి వద్ద ప్రశ్నపత్రాలు లభించడంతో అదుపులోకి తీసుకున్నారు. అరుుతే ఈ ప్రశ్నపత్రాలు నకిలీవిగా తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ ప్రశ్నపత్రాల్ని సృష్టించి అభ్యర్థుల్ని మోసగించడం లక్ష్యంగా ఈ ముఠా కుట్ర చేసినట్లు విచారణలో తేలింది. ప్రశ్నపత్రాలను రూ.పది వేల నుంచి రూ.లక్ష వరకు విక్రరుుంచినట్లు గుర్తించారు. అరెస్టయిన వారిలో కృష్ణగిరికి చెందిన గణపతి, హోసూరుకు చెందిన కృష్ణ, చంద్రశేఖర్, తలికి చెందిన అశోక్‌కుమార్, మరో వ్యక్తి ఉన్నారు.
 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)