వైద్య విద్యలో 2,018 పోస్టులు

Published on Thu, 12/14/2017 - 01:16

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడి పరిధిలో ఖాళీగా ఉన్న 2,018 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. భర్తీలో స్థానికత, రిజర్వేషన్‌ రోస్టర్‌ అంశాలను పరిగణన లోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పోస్టుల వివరాలు...
10 అనస్థీషియా టెక్నీషియన్‌ పోస్టులు, 9 ఆడియో విజువల్‌ టెక్నీషియన్, 2 బయో మెడికల్‌ ఇంజనీర్, 2 బయో మెడికల్‌ టెక్నీషియన్, 9 చైల్డ్‌ సైకాలజిస్టు, 4 సీటీ స్కాన్‌ టెక్నీషియన్, 26 డార్క్‌రూం అసిస్టెంట్, 4 డెంటల్‌ టెక్నీషియన్, 2 ఎర్లీ ఇంటర్వెంటినిస్టు, 5 ఈఈజీ టెక్నీషియన్, 6 ఈసీజీ టెక్నీషియన్, 1 ఎలక్ట్రిక్‌ ఇంజనీర్, 2 ఎఫిడమాలజిస్ట్, 30 జూనియర్‌ అసిస్టెంట్, 1 జూనియర్‌ బయోస్టాటిస్టిక్స్‌ ఆఫీసర్, 1 జూనియర్‌ ఇంజనీర్, 3 జూనియర్‌ స్టెనో, 39 ల్యాబ్‌ టెక్నీషియన్, 4 మెడికల్‌ రికార్డర్‌ క్లర్క్, 15 మెటర్నిటీ అసిస్టెంట్, 58 ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌(2), 1 ఫొటోగ్రాఫర్, 3 ఫిజియోథెరపిస్ట్, 18 రేడియోగ్రాఫర్, 9 రేడియోగ్రఫీ టెక్నీషియన్, 3 రెఫ్రాక్షనిస్ట్‌/ఆప్టీషియన్, 2 రిహాబిలిటేషన్‌ అసిస్టెంట్, 5 స్పీచ్‌ థెరపిస్ట్, 1,603 స్టాఫ్‌ నర్సు, 3 స్టాటిస్టీషియన్, 1 స్టెరిలైజేషన్‌ టెక్నీషియన్, 54 స్టోర్‌ కీపర్‌/రికార్డు క్లర్కు/కంప్యూటర్‌ ఆపరేటర్, 2 సిస్టమ్‌ ఆపరేటర్, 110 టెక్నికల్‌ అసిస్టెంట్, 61 టెక్నీషియన్‌ పోస్టులు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ