వాహనాల కొనుగోలులో జాగ్రత్త

Published on Tue, 07/24/2018 - 10:44

ఖిలా వరంగల్‌ : సెకండ్‌ హ్యాండ్, కొత్త వాహనాల కొనుగోలు చేసేటపుడు వినియోగదారులు అత్యంత జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు కొన్నప్పుడు ఆర్‌సీబుక్, ఇన్సూరెన్స్, రోడ్డు టాక్స్‌ వంటి వాటిని సరి చూసుకోకుంటే వినియోగదారుడికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కొత్తవి కొన్నప్పుడు చాసీస్‌ నెంబర్, తయారీ తేది ఇతర వివరాలు సరిచూసుకోవాలి. పాత వాహనాలైతే ఏ జిల్లాకు చెందినవి, ఎవరిపేరుపై ఉన్నాయి.

ఎన్ని కిలో మీటర్లు తిరిగాయి, తయారీ తేది, ఇతర వివరాలు తెలుసుకోవాలని అధికారులు చెబుతున్నారు.  కొంత మంది నేరగాళ్లు హత్యలు, దోపీడీలకు వినియోగించిన వాహనాలను గుట్టు చప్పుడు కాకుండా ఇతర జిల్లాల్లోకి తీసుకెళ్లి ఆమ్మేయడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారింది. వాటిని కొనుగోలు చేసిన ఆమాయకులు చిక్కుల్లో పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలా సెకండ్‌ వాహనాలు కొనుగోలు చేసేటపుడు ఆర్టీఏ, ట్రాఫిక్‌ ఆధికారులను సంప్రదించి కేసుల వివరాలు సేకరించి సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు కొనుగోలు చేయాలని ఆధికారులు హెచ్చరిస్తున్నారు.

వాహనాల వివరాల కోసం తెలంగాణ ట్రాన్స్‌ఫోర్ట్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి వాహనం నంబర్‌ ఎంటర్‌ చేయగానే పేరు, అడ్రస్‌ ఇతర వివరాలు వస్తాయి. వాటి ఆధారంగా బైక్‌ లేదా కారు ఎక్కడైనా దొంగతనం కాగానే వాహనదారుడి పేరు, ధృవీకరణ పత్రం, ఇన్సూరెన్స్‌ పత్రాల పరిశీలనతోనే తెలిసిపోతుంది. కానీ ధృవీకరణ పత్రాలు ఏక్కడైనా మార్పింగ్‌ జరిగినట్లు అనిపిస్తే వెంటనే ఆర్టీఏను సంప్రదిస్తే వాహన వివరాలు తెలుసుకోవచ్చు.

అతివేగంగా వాహనాలు నడిపిన వారికి, ప్రమాదం చేసి తప్పించుకొని తిరుగుతున్నా వాహనాల వివరాలు కేసు నమోదును బట్టి  తెలిసిపోతుంది. సెకండ్‌ హ్యాండ్‌ వాహనం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు జాగ్రత్తలు పాటించకుంటే కష్టాలు తప్పవని రవాణాశాఖ ఆధికారులు హెచ్చరిస్తున్నారు. వాహన కొనుగోలు చేసే ముందు ఆర్టీఏ, ట్రాఫిక్‌ ఆధికారులను సంప్రదించి  వాహనం కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. 

పత్రాలు సరిచూసుకోవాలి కంచి వేణు డీటీఓ వరంగల్‌

సెకండ్‌ హ్యాండ్‌ వాహనం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ధృవీకరణ పత్రాలు సరిచూసిన వెంటనే ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించి వాహన వివరాలను తెలుసుకోవాలి. వాహన రిజిస్ట్రేషన్‌తో పేరు మార్పిడి జరుగుతుంది. వాహనం అమ్మేవారు సైతం వెంటనే కొనుగోలుదారుడి పేరు మీద రిజిస్ట్రేషన్‌ జరిగేలా ఒత్తిడి చేయాలి. వాహనం కొనాలన్నా, విక్రయించాలన్నా ఆర్టీఏ నిబంధనాలు పాటించాలి.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)