గెలిపిస్తే రైతులకు సాగునీరు అందిస్తాం

Published on Fri, 11/09/2018 - 09:21

సాక్షి,భువనగిరి అర్బన్‌ : బీఎల్‌ఎఫ్‌ పార్టీని గెలుపిస్తే రైతులకు సాగునీరు అందిస్తామని బీఎల్‌ఎఫ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కల్లూరి మల్లేషం అన్నారు. గురువారం బీఎల్‌ఎఫ్‌ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని తుక్కాపురం, గౌస్‌నగర్, ఎర్రంబెల్లి, నందనం, నమాత్‌పల్లి, బొల్లేపల్లి, అనాజిపురం గ్రామాల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే వారిని అధిక మెజార్టీతో గెలుపించాలన్నారు. బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు.  ప్రధానంగా బీటీ రోడ్డు లేని గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని, స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. స్థానికంగా వివిధ పరిశ్రమాలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఆవకాశాలు కల్చించేలా కృషిచేస్తామన్నారు. ఆడపిల్లల చదువుకోసం చదువుల సావిత్రి పథకం, 2 లక్షల ఉద్యోగాల భర్తి, నిరుద్యోగబృతిని వంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. బీఎల్‌ఎఫ్‌ పార్టీని ప్రజలు అధిక మెజార్టీతో గెలుపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చింతల కిష్టయ్య, దయ్యాల నర్సింహ్మ, జంగయ్యయాదవ్, అంజిరెడ్డి, వెంకటేష్, దానయ్య, గునుగుంట్ల శ్రీనివాస్‌గౌడ్,మల్లేషం, వైకుంఠం, అయిలయ్య, ఇస్తారి, యాదయ్య, పాక జహాంగీర్‌ తదితరులు పాల్గొన్నారు.     

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ