ఆ సీట్లు ఇస్తేనే కూటమి గురించి ఆలోచిస్తాం : చాడ

Published on Mon, 11/05/2018 - 18:14

సాక్షి, హైదరాబాద్‌ : కేసీఆర్‌కు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న మహాకూటమిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని మహాకూటమిని తామే ప్రతిపాదించామని, కానీ కూటమిలో అది జరగట్లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. కూటమి బలోపేతంకు చాలా ఆలస్యం అయిందన్నారు. తొమ్మిది నియోజకవర్గాల్లో సీపీఐ పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి, ఆలేరు, మునుగోడు, మంచిర్యాల, దేవరకొండ, పినపాక నియోజకవర్గాల్లో సీపీఐ పోటీ చేయనుందని చాడ తెలిపారు.

ఏది ఏమైనా ఈ సీట్లలో సీపీఐ పోటీ చేస్తుందని చాడ స్పష్టం చేశారు.  ఈ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ ముందు జాబితా పెట్టామన్నారు. ఈ తొమ్మిది స్థానాలు గౌరవ ప్రదంగా సీపీఐకి కేటాయిస్తే కూటమి గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ