బాల్క సుమన్‌పై సంచలన ఆరోపణలు చేసిన జగ్గారెడ్డి

Published on Sat, 06/03/2017 - 18:07

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బాల్క సుమన్‌ చేసిన సవాల్‌ను స్వీకరించటానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘నన్ను గుండు కొట్టిచ్చి హైదరాబాద్లో తిప్పుతానంటున్నావ్. నీ సవాల్ ను స్వీకరిస్తున్నా. నన్ను ముట్టుకునే దమ్ముందా? బాల్క సుమన్ ఓ బచ్చా.

నీపై ఆరోపణలు ఉన్నాయి. ఉద్యమ సమయంలో కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేయడానికి ఇద్దరు విద్యార్థులను బలి తీసుకున్నావు. తెలంగాణ పేరుతో నువ్వు చేసిన హత్యలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తేల్చుతాం. ఓయూలో కేసీఆర్తో సభ పెట్టించే దమ్ము బాల్క సుమన్కు ఉందా? అదే ఓయూలో మేం సభ పెడతాం. హైదరాబాద్లో నిన్ను తిరగకుండా చేయగలను.’ అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులే సంగారెడ్డికి రావడానికి జంకుతున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ