amp pages | Sakshi

గోల్కొండ.. పర్యాటకానికి అండ

Published on Thu, 08/13/2015 - 04:05

పంద్రాగస్టు వేడుకలతో  సందర్శకుల తాకిడి
* చార్మినార్‌ను వెనక్కి నెట్టిన వైనం

సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోట పర్యాటకరంగానికి ఊతమిస్తోంది. సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలోనే గత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాలను గోల్కొండ కోటపై ప్రభుత్వం నిర్వహించింది. మువ్వన్నెల జెండా రెపరెపలు గోల్కొండకు కొత్త ఊపునిచ్చాయి. దీంతో గోల్కొండకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అప్పటి వరకు తెలంగాణలో అత్యధిక పర్యాటకులు సందర్శించే చారిత్రక స్థలంగా రికార్డుల్లో నమోదైన చార్మినార్‌ను వెనక్కునెట్టి గోల్కొండ అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

మరోసారి గోల్కొండ కోట మీద జాతీయ పతాకం సగర్వంగా ఎగరనుండటంతో ఈసారి కూడా కోట ఖ్యాతి మరింత విస్తరించనుంది. పంద్రాగస్టు వేడుకలను కోటలో నిర్వహించటంతో గత సంవత్సరం ఆగస్టులో దేశవిదేశాల్లో దానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. దీంతో సరిహద్దులు దాటి పర్యాటకులు కోట వైపు క్యూ కట్టారు. గత సంవత్సరం ఆగస్టు వరకు నెలకు సగటున లక్ష మంది పర్యాటకులు కోటను సందర్శిస్తూ రాగా... ఆ తర్వాత అది 1.60 లక్షలకు చేరుకుంది. అప్పటి వరకు సగటున నెలకు లక్షన్నర మంది పర్యాటకులతో తొలిస్థానంలో ఉన్న చార్మినార్ ఇప్పుడు రెండోస్థానానికి పడిపోయింది.

గోల్కొండకు పర్యాటకుల తాకిడి స్థిరంగా ఉంటుందని గుర్తించిన కేంద్రపురావస్తు శాఖ ప్రత్యేక చర్యలకూ సిద్ధమైంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోటలోని ‘సౌండ్ అండ్ లైట్ షో’కు కూడా పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. దీన్ని కూడా మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధమైంది. గత ఆగస్టు 15కు పూర్వం సగటున రోజుకు వంద మంది సౌండ్ అండ్ లైట్ షోను సందర్శిస్తుండగా ఒక్కసారిగా ఆ సంఖ్య 500 ను చేరుకోవటం విశేషం. అప్పటి వరకు రోజుకు రూ.పది వేలలోపు ఆదాయం ఉండగా అది ప్రస్తుతం రూ.75 వేలకు చేరింది. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రాక భారీగా పెరిగింది. సగ టున నెలకు 1200 విదేశీ పర్యాటకులు కోట దర్శనానికి వస్తుండడం విశేషం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)