వర్సిటీలో చిరుత కలకలం.. పరీక్షలు వాయిదా

Published on Fri, 01/10/2020 - 15:35

సాక్షి, నిజామాబాద్‌ : డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీతో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన వారికి చిరుత కనిపించడంతో  విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వర్సిటీలోని ఎంసీఏ భవనం వద్ద చిరుత సంచరిస్తున్నట్లు విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో హాస్టల్ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిరుత గాలింపు కోసం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వర్సిటీ ఆవరణలో చిరుత పులి పాద ముద్రల కోసం ఇందల్‌వాయి అటవీ రేంజి అధికారులు, సిబ్బంది అన్వేషిస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం జరగాల్సిన పీజీ పరీక్షలను వాయిదా వేశారు. ఈ రోజు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 22వ తేదీన తిరిగి నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి వెల్లడించారు.


Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ