ఖజానా ఖాళీ!

Published on Fri, 04/18/2014 - 00:17

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ) కార్యక్రమంలో భాగంగా పదోన్నతులు పొందిన టీచర్లకు వేతన కష్టాలు మొదలయ్యాయి. ఆయా ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించే ప్రధాన పద్దులో కాసులు నిండుకోవడంతో ఈ సమస్య తలెత్తింది. నెల ప్రారంభమై 18 రోజులు పూర్తయినా ఆయా ఉపాధ్యాయులకు ఇప్పటికీ వేతనాలు అందలేదు. ఖజానా విభాగం అధికారులు సైతం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతో వారిలో ఆందోళన తీవ్రమవుతోంది.

 జిల్లాలో ఆర్‌ఎమ్‌ఎస్‌ఏలో భాగంగా 2012లో 633 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. అవసరం మేరకు వీరిని ఆయా ఉన్నత పాఠశాలల్లో నియమించారు. అయితే వీరికి ప్రతినెల ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ ప్రధాన పద్దు నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. తాజాగా ఈ పద్దులో నిధులు నిండుకున్నాయి. దీంతో మార్చి నెలకు సంబంధించి ఆయా టీచర్లకు చెల్లించాల్సిన వేతనాలకు కటకట నెలకొంది. ఈ నేపథ్యంలో వేతనాలు చెల్లించాలంటూ ఉపాధ్యాయులు ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రధాన పద్దు నుంచి ఇతర పద్దులోకి మార్చి వేతనాలు చెల్లించాలంటూ ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. కానీ పద్దు మార్పు చేయడంలో నెలకొన్న జాప్యంతో ఆయా ఉపాధ్యాయులకు ఇప్పటివరకు వేతనాలు అందలేదు.

 అధికారుల నిర్లక్ష్యం
 ఆర్థిక శాఖ ఆదేశాల ప్రకారం ప్రధాన పద్దు నుంచి వారికి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్న పద్దు నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఇందులో భాగంగా పద్దు మార్పును సూచిస్తూ అన్ని ఖజానా విభాగానికి బిల్లులు అందజేశారు. కానీ ఆ విభాగ అధికారులు మాత్రం ఈ బిల్లులను ఇప్పటికీ క్లియర్ చేయకుండా అట్టిపెట్టుకున్నాయి. దీంతో ఉపాధ్యాయులకు నెల గడుస్తున్నా ఇప్పటికీ వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Videos

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)