amp pages | Sakshi

నామినేషన్‌ వేస్తున్నారా..

Published on Sat, 11/10/2018 - 08:47

సాక్షి,హన్మకొండ :ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాల్లో పూర్తి వివరాలు రిటర్నింగ్‌ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతిపాదకులు, అఫిడవిట్‌ ఫొటోలు అందజేయాలి. ఫారాలు పూర్తిగా నింపాలి. ఇందులో ఏ మాత్రం తేడాలు ఉన్నా నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అభ్యర్థులు తమ నామినేషన్లలో అందజేయాల్సిన వివరాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.

  • నామినేషన్‌ వేసేందుకు 2బీ ఫారం ఉచితంగా రిటర్నింగ్‌ అధికారుల వద్ద లభిస్తుంది.
  • ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు పత్రాల నామినేషన్లు వేయొచ్చు.
  • నామినేషన్‌ కోసం రెండు స్టాంప్‌ సైజ్‌ ఫొటోలు అవసరం. వాటిలో ఒకటి నామినేషన్‌ పత్రంపై, మరొకటి ఫారం 26పై (అఫిడవిట్‌) అతికించాల్సి ఉంటుంది.
  • పోటీచేసే జనరల్‌ అభ్యర్థులు 10 వేల రూపాయల డిపాజిట్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఐదు వేలు జమచేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం జతచేయాలి.
  • గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ (రాష్ట్రీయ) పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థులకు తమ నామినేషన్‌లో అదే నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఫారం 2బీలో పార్ట్‌–1లో అడుగుతారు.
  • పోటీ చేయడానికి నామినేషన్‌ వేసే ఇతర అభ్యర్థులు ..అంటే రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు అదే నియోజకవర్గంలోని 10 మంది ఓటర్లు, ఫారం 2బీలోని పార్ట్‌–2లో ప్రతిపాదించాల్సి ఉంటుంది.
  • గుర్తింపు పొందని పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రంలో ఫారం 2బీ లోని పార్ట్‌–3లోని కాలం–సీ లో ఎన్నికల సంఘం సూచించిన వాటిలో మూడు గుర్తులను ప్రాధాన్యతా క్రమంలో తెలపాల్సి ఉంటుంది.
  • అభ్యర్థి ఆ నియోజక వర్గం స్థానికుడు కానట్లైతే అతడు ఓటరుగా ఉన్న నియోజక వర్గం నుంచి ఈఆర్‌ఓ ధృవీకరణ చేయించిన పత్రం నామినేషన్‌తో జతచేయాల్సి ఉంటుంది.
  • అభ్యర్థి ప్రతిపాదకులు నిరక్షరాస్యులు అయితే రిటర్నింగ్‌ అధికారి ముందు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
  • పోటీచేసే అభ్యర్థి తన ఎన్నికల ఖర్చుల లెక్కలకు సంబంధించి నామినేషన్‌ వేయడానికి 48గంటలముందు తన పేరుతో కొత్తగా బ్యాంక్‌ ఖాతా ప్రత్యేకంగా ప్రారంభించి అందజేయాల్సి ఉంటుంది. గతంలో తెరిచిన ఖాతాలు అందజేయడానికి వీలులేదు.
  • నామినేషన్‌ పత్రంలోని ప్రతికాలం తప్పనిసరిగా పూర్తిచేయాలి. ఒకవేళ వదిలేస్తే అక్కడ..లేదు... వర్తించదు అని తప్పనిసరిగా రాయాలి. ఏ ఒక్క కాలం కూడా ఖాళీగా వదలకూడదు. (–)లతో కాలం నింపవద్దు
  • గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, రిజిస్టర్డ్, గుర్తింపు పొందని పార్టీలు ఫారం–ఏ, ఫారం బీ ఇంకు సైన్‌ చేయబడిన ప్రతిని నామినేషన్ల చివరి రోజు డిసెంబర్‌ 19వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు రిటర్నింగ్‌ అధికారికి అందజేయాల్సి ఉంటుంది.
  • భారత ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఫారం–26 నోటరైజ్డ్‌ అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్‌ నింపాలి. 
  • అభ్యర్థి తన నామినేషన్‌ పత్రంలో తనపైగల క్రిమినల్‌ కేసుల వివరాలు పార్ట్‌–3ఏ లో తప్పనిసరిగా వివరించాల్సి ఉంటుంది.
  • కరంటు బిల్లు, ఇంటిపన్ను, నీటిపన్ను , ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉన్నట్లైతే గత 10 సంవత్సరాలుగా బకాయిలు లేనట్లు ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది.
  • నామినేషన్‌ వేసే ముందు భారత ఎన్నికల సంఘం నిర్ధేశించిన ప్రతిజ్ఞ/శపథం/ తెలుగు లేదా ఇంగ్లీష్‌లో చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞతను నచ్చిన దేవుని పేరుతోగానీ, మనస్సాక్షి ప్రకారం చేయొచ్చు. 
  • అభ్యర్థి తన యొక్క స్పెసిమెన్‌ సంతకం రిటర్నింగ్‌ అధికారికి అదజేయాల్సి ఉంటుంది.
  • అభ్యర్థి తన పేరు బ్యాలెట్‌ పేపర్‌లో ఏవిధంగా ముద్రించాల్సి ఉంటుందో పేపర్‌ పైన రాసి ఇవ్వాలి.

రిటర్నింగ్‌ అధికారి నుంచి పొందాల్సినవి..

  •      చెల్లించిన డిపాజిట్‌ మొత్తానికి రసీదు.
  •      స్క్రూటినీకి హాజరయ్యేందుకు నోటీసు
  •      ఎన్నికల వ్యయం నమోదు రిజిస్టర్‌
  •      కరపత్రాలు, పోస్టర్లు, ప్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రి ముంద్రించేందుకు చట్టంలోని సెక్షన్‌ 127–ఏ కింద సూచనలు
  •      ప్రతిజ్ఞ/శపథం చేసినట్లు ధృవీకరణ పత్రం
  •      నామినేషన్‌ పత్రంలోని లోపాలు, ఇంకా జత చేయాల్సిన పత్రాల సూచిన(చెక్‌ మెమో)

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)