amp pages | Sakshi

అమ్మను గెంటేశారు..

Published on Mon, 04/10/2017 - 00:43

సిరిసిల్ల: ‘నా వాటాలో ఏన్నాళ్లుంటావ్‌’ అంటూ ఓ కొడుకు కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేసి.. తాళం వేసుకొని వెళ్లిపోయాడు. నాలుగు రోజులుగా చెట్టు కింద బతికిన 86 ఏళ్ల ఆ తల్లిని మరో కొడుకు చేర దీసినా.. ఇంట్లోకి మాత్రం రానివ్వలేదు. కుల పెద్దలను ఆశ్రయించినా.. ఆ కొడుకులు వినకపోవడంతో ప్రస్తుతం ఆరుబయట జీవనం సాగిస్తోందా తల్లి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన సామల కమలమ్మ, సిద్ధిరాములు దంపతులు. వీరికి కుమారులు మీనయ్య, శ్రీనివాస్, రమేశ్, సురేశ్, లక్ష్మీనారాయణ, కూతుళ్లు వసంత, వశ్చల ఉన్నారు.

నేత కార్మికుడైన సిద్ధిరాములు మంచి ఇల్లు కట్టుకుని.. పిల్లల పెళ్లిళ్లు చేశాడు. 12 ఏళ్ల కిందట ఆయన అనారోగ్యంతో మరణిం చాడు. అప్పట్నుంచి కమలమ్మ కొడుకులు, కూతుళ్లు ఉన్నా వాళ్ల వద్ద ఉండలేక ఒంటరిగా జీవిస్తుంది. చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ ఆసరా పింఛన్, రేషన్‌ బియ్యంతో బతుకు సాగిస్తోంది. కాగా, తల్లిదండ్రులు సంపాదించిన సుమారు రూ.30 లక్షల విలువైన ఇంటిని కొడుకులు పంచుకున్నారు. మూడో కుమారుడు రమేశ్‌ భివండిలో ఉంటున్నాడు. అతడి వాటాగా వచ్చిన ఇంట్లోనే కమలమ్మ ఉంటోంది. నాలుగు రోజుల క్రితం రమేశ్‌ వచ్చి కమలమ్మ సామగ్రి బయట పడేసి, ఇంటికి తాళం వేసి భివండి వెళ్లిపోయాడు. కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. మిగతా కొడుకుల వద్దకు వెళ్లి.. ‘నేను ఎక్కడ ఉండాలే.. నాకు ఇంత నీడ చూపుండ్రి’ అని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కుల పెద్దలు జోక్యం చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.

తలదాచుకునేందుకు నీడలేక రోడ్డు పక్కన వంట చేసుకుంటూ కనిపించగా.. స్థానికులు జోక్యం చేసుకోవడంతో రెండో కుమారుడు శ్రీనివాస్‌ వచ్చి తల్లిని తీసుకెళ్లినా.. ఇంట్లోకి మాత్రం రానివ్వలేదు. దీంతో ఆరుబయటనే ఆమె ఉంటోంది. ‘నా కొడుకులు యాడుంటవని అంటున్నరు.. కాళ్లు కాలుతున్నయి.. గాలి వత్తలేదు.. నాలుగు రోజులు బతికే ముసలిదాన్ని.. ఎవరూ పట్టించుకుంటలేరు.. ఇప్పుడు వాళ్లకు తల్లి వద్దు.. పెళ్లాలే కావాలే.. ఆ దేవునింట్ల మన్నువొయ్య.. నన్ను తీసుకపోతలేడు.. సావన్నా వత్తలేదు.. ఒంటరిగా వంట చేసుకుంటూ బతుక బుద్ధిగావట్లేదు’అని కమలమ్మ రోదించడం కలచివేసింది.

Videos

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)