నేను ‘బావ’ బాధితుడిని : సుధీర్‌రెడ్డి

Published on Mon, 07/20/2020 - 13:24

సాక్షి, హైదరాబాద్‌ :  ఆదిత్యా హోమ్స్‌ డైరెక్టర్‌, చైర్మన్‌ మధ్య నెలకొన్న వివాదం తారా స్థాయికి చేరింది. ఇంటి సమస్య కాస్తా తీవ్ర విభేదాలతో రచ్చకెక్కింది. 100 కోట్ల రూపాయలు విలువచేసే డాక్యుమెంట్ల చోరీతో మొదలైన వివాదం మరింత ముదిరింది. తన బావ కోటారెడ్డి తనను జైలుకు పంపేందుకు కుట్రలు పన్నుతున్నారని సుధీర్‌రెడ్డి ఆరోపించారు. వ్యాపారం పేరుతో తన కుటుంబాన్ని నిలువునా మోసం చేశారని, కంపెనీ లాభాలు తీసుకుని తమను దోచుకున్నారని వాపోయారు.  కొడుకుతో తనకు ప్రాణహాని ఉందని సుధీర్‌రెడ్డి తల్లి అజంతా సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. (ఆ చోరీ చేసింది నా కొడుకే.. ప్రాణాహాని ఉంది)

‘15 ఏళ్లుగా కోటారెడ్డి కుటుంబంతో మాకు మాటల్లేవు. 1995లో నేను అమెరికా వెళ్లాను. నేను, నా భార్య కలిసి డబ్బు సంపాదించి తిరిగి ఇండియా వచ్చాం. మా నాన్న చనిపోతూ కుటుంబమంతా కలిసి ఉండాలని కోరుకున్నారు. 2016లో నేను ఆదిత్యా హోమ్స్‌లో డైరెక్టర్‌గా చేరాను. అప్పటి నుంచి అమ్మ, అక్క.. నన్ను వేధించడం మొదలుపెట్టారు. ఇంటిని మా అమ్మకు ఇచ్చేందుకు అక్కా,బావ ప్లాన్‌ వేశారు. 2014లో వంశీరామ్‌ బిల్డర్స్‌తో కలిసి.. గండిపేట్‌లో మా బావ కోటారెడ్డి విల్లా ప్రాజెక్ట్‌ ప్రారంభించారు. అందులో 25 విల్లాలకు నా ద్వారానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసే అధికారం ఎవరిచ్చారంటూ.. వంశీరామ్‌ బిల్డర్స్‌ సుబ్బారెడ్డి నన్ను ప్రశ్నించారు. సుబ్బారెడ్డికి తెలియకుండా విల్లాల రిజిస్ట్రేషన్లు చేసే అధికారం మా బావ కోటారెడ్డే నాకు ఇచ్చారు. ఈ విషయంలో కోటారెడ్డి నన్ను మోసం చేశారు. సుబ్బారెడ్డి అనుమతి లేకుండా నేను సేల్‌ డీల్స్‌ చేయడం తెలీకుండా చేసిన తప్పు. (100 కోట్ల విలువైన డాక్యుమెంట్లు అపహరణ)

ఆదిత్యా హోమ్స్‌పై కేసులు పెడతానని ఆనాడే సుబ్బారెడ్డి హెచ్చరించారు. వాళ్లు చేసిన తప్పులను నాపై నెట్టేశారు. నేను సుబ్బారెడ్డితో కుమ్మక్కయ్యాననేది మా బావ అపోహ.. నా ఇంటిని కాజేయాలని, నన్ను ఇంటి నుంచి గెంటేసే కుట్ర చేశారు. పోలీసుల పేరుతో నా ఇంట్లో సోదాలు చేసేందుకు కోటారెడ్డి కొందరు మనుషుల్ని పంపించారు. నాకు, మా బావకు వ్యక్తిగతంగా గన్‌ లైసెన్స్‌లు ఉన్నాయి. ఎన్నికల సమయంలో తన గన్‌ సరెండర్‌ చేయడానికి మా బావే నాకు ఆథరైజేషన్‌ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఇద్దరి గన్స్‌ సరెండర్‌ చేస్తే పోలీసులు మా బావ గన్‌ మాత్రమే తిరిగి ఇచ్చారు. ఇదంతా కుట్రలో భాగంగానే సాగుతోంది. నేను బావ బాధితుడిని’ అని తెలిపారు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)