ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌

Published on Sat, 04/20/2019 - 16:52

హైదరాబాద్‌: తెలంగాణాలో ఎన్నికల హడావిడి మళ్లీ మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి శనివారం విడుదల చేశారు. హైదరాబాద్‌లో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికలను 3 దశల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణాలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీస్థానాలు ఉన్నాయన్నారు. 47 ఎంపీటీసీ స్థానాలతో పాటు, మంగపేట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించడం లేదని వెల్లడించారు. నేటి నుంచి కోడ్‌ అమలులోకి రానుందని చెప్పారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో జరుగుతాయని చెప్పారు. తెలుపు రంగులో ఎంపీటీసీల బ్యాలెట్‌ పేపర్‌, గులాబీ రుంగులో జెడ్పీటీసీల బ్యాలెట్‌ పేపర్లు ఉంటాయని తెలిపారు.



ఎంపీటీసీలకు రూ 1.5 లక్షలు, జెడ్పీటీసీలకు రూ.4 లక్షల గరిష్ట వ్యవపరిమితిగా నిర్ధారించినట్లు వెల్లడించారు. మొత్తం 32 వేల 7 పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం ఒక కోటి 56 లక్షల 11 వేల 320 మంది ఓటర్లు ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారని అన్నారు. మొదటి విడతలో 197 జెడ్పీటీసీలు, 2166 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో 180 జెడ్పీటీసీలు, 1913 ఎంపీటీసీ స్థానాలకు, మూడో విడతలో 161 జెడ్పీటీసీలు, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు లక్షా 47 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని,  అలాగే ఎన్నికల ఫలితాలను మే 27న వెల్లడిస్తామని చెప్పారు.

తొలి దశలో(197 జెడ్పీటీసీలు..2166 ఎంపీటీసీలు స్ధానాలు)

నామినేషన్‌: ఏప్రిల్‌ 22 నుంచి ఏప్రిల్‌ 24 వరకు
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 25న
ఫిర్యాదులు: ఏప్రిల్‌ 27
నామినేషన్‌ ఉపసంహరణ: ఏప్రిల్‌ 28 వరకు
పోలింగ్‌: మే 6న

రెండో దశ(180 జెడ్పీటీసీలు..1913 ఎంపీటీసీలు స్ధానాలు)

నామినేషన్‌: ఏప్రిల్‌ 26 నుంచి ఏప్రిల్‌ 28 వరకు
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 29న
ఫిర్యాదులు: మే 1న
నామినేషన్‌ ఉపసంహరణ: మే 2 వరకు
పోలింగ్‌: మే 10న

మూడో దశ(161 జెడ్పీటీసీలు..1738 ఎంపీటీసీలు స్ధానాలు)

నామినేషన్‌: ఏప్రిల్‌ 30 నుంచి మే 2 వరకు
నామినేషన్ల పరిశీలన: మే 3న
ఫిర్యాదులు:  మే 5న
నామినేషన్‌ ఉపసంహరణ: మే6 వరకు
పోలింగ్‌: మే 14

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ