amp pages | Sakshi

నామినేషన్ల హోరు

Published on Fri, 01/11/2019 - 12:45

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పల్లె పోరులో నామినేషన్లు వెల్లువెత్తాయి. ఈనెల 21న జరిగే గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలకు బుధవారం అర్ధరాత్రి వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సాగింది. సాయంత్రం 5 గంటలకే గడువు ముగిసినా ఆలోపే రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి చేరుకున్న అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాల స్వీకరణకు సమయం పట్టింది. జిల్లావ్యాప్తంగా తొలిదశలో 179 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. గ్రామ సర్పంచ్‌ పదవులకు 673 మంది 982 నామినేషన్‌ సెట్లను దాఖలు చేశారు. అలాగే 1,580 వార్డు స్థానాలకు 3,684 మంది 4,735 నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణే కాదు.. పరిశీలనలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రాత్రి పొద్దుపోయే వరకు స్క్రూట్నీ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో ఎన్ని నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.

ఎనిమిది ఏకగ్రీవం! 
మొదటి దశలో ఎనిమిది గ్రామాల సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పదవులకు సింగిల్‌ నామినేషనే దాఖలు కావడంతో గెలుపు లాంఛనప్రాయంగా మారింది. ఈనెల 13న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు. కొందుర్గు మండలం లక్ష్మీదేవునిపల్లి (నర్సింలు), జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం ముష్టిపల్లి (యాదమ్మ), ఫరూఖ్‌నగర్‌ మండలంలోని ఉప్పరిగడ్డ తండా (రేఖాచందానాయక్‌), కొత్తూరు మండలం పరిధిలోని మల్లాపూర్‌ తండా (సభావట్‌ రవినాయక్‌), నందిగామ మండల పరిధిలోని బండోనిగూడ (జెట్ట కుమార్‌), కాన్హా (సరిత)సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట సర్పంచ్‌ స్థానానికే కవిత ఒక్కరే నామినేషన్‌ వేశారు. దీంతో ఆమె విజయం ఖాయమైంది. చింతకొండపల్లి గ్రామ సర్పంచ్‌గా పార్వతమ్మ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

రెండో దశకు నేటినుంచి నామినేషన్లు 
ఈ నెల 25న పోలింగ్‌ జరిగే గ్రామ పంచాయతీలకు శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. రెండో దశలో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, మంచాల, యాచారం. కడ్తాల, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల పరిధిలోని 181 గ్రామ పంచాయతీలు, 1656 వార్డు స్థానాలకు శుక్రవారం నుంచి ఆదివారం వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)