ఇప్పుడే ఇవ్వలేం

Published on Thu, 01/10/2019 - 01:19

సాక్షి, హైదరాబాద్‌: చెన్నైకి తాగునీటి కోసం ఇప్పటికప్పుడు కృష్ణా జలాలను విడుదల చేయలేమని తెలుగు రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. చెన్నైకి తాగునీటి సరఫరాకు తక్షణమే రెండు టీఎంసీలను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కండలేరు రిజర్వాయర్‌ నుంచి మార్చిలో అప్పటి నీటి లభ్యత ఆధారంగా ఒక టీఎంసీని విడుదల చేస్తామని స్పష్టం చేశాయి. చెన్నైకి తాగునీటి సరాఫరాపై కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ హైదరాబాద్‌లో బుధవారం సమావేశమైంది. బోర్డు చైర్మన్‌ ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి ఎ.పరమేశం, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ నుంచి తెలుగుగంగ సీఈ మురళీనాథ్‌ రెడ్డి, తమిళనాడు జలవనరుల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏప్రిల్‌ 18, 1983 నాటి ఒప్పందం మేరకు..చెన్నైకి తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీలను విడుదల చేయాలని తమిళనాడు అధికారులు వివరించారు.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెన్నైలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని..తక్షణమే రెండు టీఎంసీలను విడుదల చేయాలని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటకలు వారి వాటా కింద విడుదల చేయాల్సిన పది టీఎంసీలను దిగువకు విడుదల చేయడం లేదని..ఈ నేపథ్యంలో చెన్నైకి 15 టీఎంసీలను ఎలా విడుదల చేస్తామని తెలుగు రాష్ట్రాలు ప్రశ్నించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాటా కింద విడుదల చేయాల్సిన ఐదు టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా కింద 3.3, తెలంగాణ వాటా కింద 1.7 టీఎంసీలు విడుదల చేయాలని.. అందులో రెండు రాష్ట్రాలు కలిసి రెండు టీఎంసీలను విడుదల చేయాలని తమిళనాడు కోరింది. ఈ ఏడాది కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయిందని..ఆ మేరకు నీటిని విడుదల చేయలేమని తెలుగు రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. మార్చిలో నీటి లభ్యత ఆధారంగా కండలేరు రిజర్వాయర్‌ నుంచి ఒక టీఎంసీని విడుదల చేయడానికి మాత్రం అంగీకరించాయి.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)