ఉమ్మడి పాస్‌ విధానంపై ఆర్టీసీ సమీక్ష

Published on Thu, 01/10/2019 - 19:26

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ ఉమ్మడి పాస్‌పై విధానంపై, తదితర అంశాంలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో సునీల్‌ మాట్లాడారు. ఆర్టీసీ లాభాల బాట పట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించనట్టు తెలిపారు. అదేవిధంగా నష్టాలను తగ్గించే అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.   

ఆర్టీసీ స్థలాల్లోని షాపులపై పది శాతం రెంట్‌ పెంచాలని, అదేవిధంగా ఖాళీ స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 40 ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులు వారం రోజుల్లో ప్రారంభమవనున్నాయన్నారు. కొత్తగా వెయ్యి బస్సులను కొనుగోలూ చేస్తామన్నారు. 15 రోజుల్లో ఆర్‌ఎం, డీఎంలతో మరో సమీక్ష నిర్వహిస్తామని సునీల్‌ తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ