‘రిజిస్ట్రేషన్‌’ బాధ్యతలకు మేం సిద్ధమే 

Published on Mon, 03/05/2018 - 02:17

సాక్షి, హైదరాబాద్‌: తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాల నిర్వహణకు రెవెన్యూ వర్గాలు అంగీకరించా యి. ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్‌ (టీజీటీఏ) స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల భర్తీ తదితర డిమాండ్ల విషయంలో ప్రభుత్వం హామీ ఇచ్చినందునే ఇందుకు అంగీకరిస్తున్నట్టు టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, అధ్యక్షుడు కె.గౌతం కుమార్‌ తెలిపారు.

ఆదివారం టీజీటీఏ కార్యవర్గ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా వ్యవస్థలో పారదర్శకత వస్తుందని, ప్రజలకు రిజిస్ట్రేషన్‌ సేవలు దగ్గరవుతాయన్నా రు. ప్రభుత్వం తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు. ఈ భేటీలో టీజీటీఏ కోశాధికారి రాములు, ఉపాధ్యక్షులు ముంతాజ్, విష్ణుసాగర్‌ పాల్గొన్నారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ