ఎక్స్లెంట్గా ఏసీసీ లాభాలు

Published on Tue, 07/26/2016 - 18:58

న్యూఢిల్లీ : దేశంలో సిమెంట్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఏసీసీ రెండో త్రైమాసిక లాభాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. 79 శాతం వృద్ధితో కన్సాలిడెటెడ్ నికర లాభాలు రూ.239.12 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు రూ.133.46 కోట్లగా ఉన్నాయి. ఈ సంస్థ జనవరి- డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా ఫాలో అవుతూ ఉంటోంది. దీంతో అన్నీ కంపెనీ 2016 ఆర్థిక సంవత్సర తొలి ఫలితాలను విడుదల చేస్తుండగా.. వాటికి ఒక త్రైమాసికం ముందుగా జూన్తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను ఏసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. అయితే మొత్తంగా కన్సాలిడెటెడ్ ఆదాయం 3 శాతం కోల్పోయి, రూ.2,917.26 కోట్లగా నమోదుచేసింది.2015 ఇదే క్వార్టర్లో ఈ ఆదాయాలు రూ.3,015.29 కోట్లగా ఉన్నాయి.

కంపెనీ మొత్తం ఖర్చులను సైతం 9శాతం తగ్గించుకుంది. పెట్కోక్ ఎక్కువగా వాడడంతో, ఫ్యూయల్ మిక్స్లో ఆప్టిమైజేషన్ను సాధించగలిగామని కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా స్లాగ్, బూడిద, జిప్సం, జిప్సం మిశ్రమాల ఆప్టిమైజేషన్, ఉత్పత్తి ధరలను తగ్గించిందని పేర్కొంది. సంస్థ మొత్తం వ్యయాలు ఏప్రిల్-జూన్ క్వార్టర్లో రూ.2,603.18 కోట్లకు పడిపోయాయని, గతేడాది ఇదే పీరియడ్లో ఇవి రూ.2,848.46 కోట్లగా ఉన్నాయని ఏసీసీ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ఒక్కో షేరుకు 11రూపాయల మధ్యంతర డివిడెంట్ను ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.

ధరల తగ్గింపుపై ఫోకస్ను కంపెనీ ఇలాగే కొనసాగిస్తుందని, చత్తీస్ గఢ్లోని జముల్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు, కంపెనీ స్థాయిని, లాభాలను మరింత పెంచుతుందని ఏసీసీ ఆశాభావం వ్యక్తంచేసింది.మంచి రుతుపవనాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ఇన్ ఫాక్ట్ర్చర్ డెవలప్మెంట్, హౌసింగ్, ఇతర మెగా ప్రాజెక్టుల ప్రేరణ వచ్చే త్రైమాసికంలో నిర్మాణ కార్యక్రమాలపై పాజిటివ్ ప్రభావం చూపుతాయని కంపెనీ ఫలితాల సందర్భంగా పేర్కొంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ