ప్రాణాంతక బర్డ్ ఫ్లూ కలకలం

Published on Tue, 11/29/2016 - 14:04

టోక్యో:  ప్రాణాంతకమైన బర్డ్ ఫ్లూ వ్యాధి జపాన్  ను  వణికిస్తోంది. అత్యంత వ్యాధికారకమైన  హెచ్ 5 ఎన్6  వైరస్ పౌల్ట్రీ, ఇతర అడవి జాతి పక్షులు,  జపాన్ లోని   బహుళ ప్రదేశాల్లోని  పౌల్ట్రీ ఫారాల్లో  గుర్తించడం ఆందోళనకు దారి తీసింది.  అతి ప్రమాదకరమైన హెచ్5ఎన్6  వైరస్ ను  నిర్ధారించినట్టు నివేదికలు  వెల్లడించాయి.   దీంతో లక్షలాది కోళ్లన ఏరిపారేస్తున్నారు. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తిపై జపాన్ ప్రభుత్వం స్పందించింది. తగిన చర్యలు  చేపట్టాల్సిందిగా ఆదేశించింది.
పసిఫిక్  ఐలాండ్ లో  మంగళవారం 3, 10.000 కోళ్లను నిర్మూలించినట్టు  జిన్హువా న్యూస్  వెల్లడించింది.  గతంలో సుమారు 40 కోళ్లు చనిపోవడంతో  జరిగిన పరీక్షల్లో బర్డ్ ఫ్లూ  ఉనికిని నిర్ధారించింది.  అత్యధికనష్టం కలిగించే అంటురోగ కారక క్రిమిని గుర్తించినట్టు తేల్చింది.  దీంతో నియోగాటా, అయోమోరి ప్రదేశాలకు సమీపంలోని 10 కి.మీ దూరంలో గుడ్లు తదితర   పౌల్ట్రీ  ఉత్పత్తుల రవాణాను   స్థానిక ప్రభుత్వం సంస్థ నిషేధించింది.  ఈ విషయంలో సంబంధిత అధికారులు సహకరించాల్సిందిగా ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలు, సంస్థలకు జపాన్  ప్రధాని షింజో అబే ఆదేశాలు జారీ చేశారు.  కాగా ఇటీవల బర్డ్ ఫ్లూ  వ్యాప్తికి సంబంధించి గరిష్టంగా బర్ద్ ఫ్లూ వైరస్ నమునా-3  హెచ్చరికలను జారీ చేసిన సంగతితెలిసిందే.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ