మా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దు: భారత్

Published on Tue, 08/20/2013 - 02:38

పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక
 న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న తరుణంలో.. తమ సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని ఆ దేశాన్ని భారత్ హెచ్చరించింది. ఈ మేరకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సోమవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ఐదుగురు భారత సైనికులను కాల్చివేసిన ఘటనకు పాకిస్థాన్ బాధ్యత వహించక తప్పదని.. ఆ దేశానికి, వారి సైన్యానికి సంబంధం లేకుండా అదంతా జరగదని వ్యాఖ్యానించారు. ఆ దేశం తరచూ కాల్పులకు దిగుతోందని, వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని ఆంటోనీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్థాన్ 82 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని చెప్పారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ