రోడ్డు చెరువైంది!

Published on Fri, 01/29/2016 - 04:53

నాగోలు వద్ద పగిలిన పైపులైన్
హైదరాబాద్: కృష్ణా వాటర్ పైపులైన్ పగలడంతో నీరంతా వృథాగా పోయింది. బీఎన్‌రెడ్డి నగర్ నుంచి సైనిక్‌పురి, ఉప్పల్ వెళ్లే వెయ్యి ఎం.ఎం.ల పైపులైన్ నాగోలు సమీపంలోని మమతానగర్ రోడ్ నం. 2 వద్ద గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో పగలడంతో నీరంతా రోడ్డుపాలైంది. పక్కనే ఉన్న శ్రీభవాని ఎంటర్‌ప్రైజెస్ గోదాములో నీరంతా చేరడంతో హార్డ్‌వేర్ పరికరాలు, మూడు ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి. విషయం తెలుసుకున్న జలమండలి ఆపరేషన్ డెరైక్టర్ రామేశ్వరరావు, జీఎం రాజు, డీజీఎం శ్రీనివాస్‌రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంచినీటి సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపడతామని తెలిపారు. మంచినీటి పైపులైన్ పగిలి నీరు ఒక్కసారిగా పైకి లేచి రోడ్డుమీదికి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ