నూడుల్స్ ధ్వంసానికి సుప్రీంను ఆశ్రయించిన నెస్లే

Published on Thu, 09/22/2016 - 17:06

న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ  నెస్లే ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవలి నిషేధం నేపథ్యంలో భారీగా పేరుకుపోయిన  మ్యాగీ నూడుల్స్ నిల్వలను ధ్వంసం చేసేందుకు సుప్రీం అనుమతి కోరింది. గడువు తీరిన  550  టన్నుల మ్యాగీ  నూడుల్స్ ను ధ్వంసం చేయాల్సి అవసరం ఉందని తెలిపింది.  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అంగీకరించకపోడంతో సుప్రీంను ఆశ్రయించినట్టు  పేర్కొంది. జస్టిస్ దీపక్ మిశ్రాలతో, జస్టిస్ సి  నాగప్పన్  లతో కూడిన బెంచ్ ముందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ  పిటిషన్ ను  దాఖలు చేశారు.

ఇది గతంలో  హైకోర్టులో నెస్లే  లేవనెత్తిన సమస్యే అని ఎఫ్ఎస్ఎస్ఏఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ  వ్యవహారంలో  జస్టిస్ అటార్నీ జనరల్ ముకుల్  సూచనలను పాటించాల్సి ఉందని  పునరుద్ఘాటించారు. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 30 కి  వాయిదా వేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ