amp pages | Sakshi

ఎస్‌ఐపై ఇసుక మాఫియా దాడి

Published on Fri, 11/27/2015 - 02:07

* తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు
* ఘటనపై నాందేడ్ ఎస్పీ సీరీయస్
* డోజర్, టిప్పర్లు, ట్రాక్టర్ల సీజ్
* 17మందిపై కేసులు నమోదు
రెంజల్: ఇసుక మాఫియా బరితెగించింది. మఫ్టీలో వచ్చిన మహారాష్ట్ర పోలీసులపై దాడి చేసింది. మాఫియా దెబ్బకు ధర్మాబాద్ ఎస్సై తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవగా మరో ఇద్దరు కానిస్టేబుళ్లు పరారయ్యారు.

ఎస్సైపై దాడి ఘటనను మహారాష్ట్రలోని నాందేడ్ ఎస్పీ సీరీయస్‌గా తీసుకున్నారు. వెంటనే ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించి అక్రమ ఇసుక క్వారీ నుంచి డోజర్‌తోపాటు 3 టిప్పర్లు, 4 ట్రాక్టర్లను సీజ్ చేసి ధర్మాబాద్ ఠాణాకు తరలించారు. బాధ్యులైన పలువురిని అదుపులోకి తీసుకున్నారు.  నిజామాబాద్ జిల్లాకు సరిహద్దున తెలంగాణ-మహారాష్ట్ర మధ్యన గల గోదావరి నదిలో కందకుర్తి వద్ద వంతెన కింద 20 రోజులుగా డోజర్లు, యంత్రాలతో అక్రమంగా మాఫియా సభ్యులు ఇసుక తవ్వకాలను చేపడుతున్నారు.

మహారాష్ట్రలోని ధర్మాబాద్ ప్రాంతానికి చెందిన వీరు యథేచ్ఛగా అక్రమ క్వారీని ఏర్పాటు చేసుకుని.. ఇసుకను నది అవతలి వైపునకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మాబాద్ ఎస్సై అమూల్ నాయక్ బుధవారం రాత్రి సిబ్బందితో మఫ్టీలో అక్రమ క్వారీ వద్దకు వచ్చారు. డోజర్లు, యంత్రాలతో గోదావరి నదిలో తవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు ఇసుకను చేరుస్తుండగా.. అక్కడకు చేరుకుని  తవ్వకాలు చేపడుతున్న డోజర్ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు.

అక్కడున్న ఇసుక మాఫియా సభ్యులు కందకుర్తి, ధర్మాబాద్ ప్రాంతాల్లోని మిగతా వారికి సమాచారం అందించారు. దీంతో వారంతా కందకర్తి, ధర్మాబాద్ ప్రాంతాల నుంచి అక్రమ క్వారీ వద్దకు కర్రలతో చేరుకున్నారు. రెచ్చిపోయి ఎస్సై పై తిరగబడ్డారు. కర్రలతో దాడి చేసి గాయపర్చారు. మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు.  

ఎస్సైపై దాడి విషయం తెలుసుకున్న నాందేడ్ ఎస్పీ ప్రేమ్‌సింగ్ దయా వెంటనే స్పందించారు. ధర్మాబాద్ సీఐ రాజేందర్ సహానే నేతృత్వంలో ప్రత్యేక బలగాలను అక్రమ క్వారీ వద్దకు పంపించారు. అప్పటికే పలువురు పలాయనం చిత్తగించగా మరి కొందరిని పట్టుకుని అక్కడున్న డోజర్, మూడు టిప్పర్లు, నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి ధర్మాబాద్ ఠాణాకు తరలించారు.

గురువారం నాందేడ్ ఎస్పీ ప్రేమ్‌సింగ్ దయా కందకుర్తి వద్ద గల వంతెన వద్దకు చేరుకుని అక్రమ క్వారీని పరిశీలించారు. ఇసుక మాఫియా ఎంతటిదైనా.. వారి ఆగడాలను అరికడతామని ెహ చ్చరించారు. పోలీసులపై దాడి చేసిన 17మందిపై 307, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గోదావరి నది మహారాష్ట్ర పరిధిలో ఉందని తెలంగాణ పోలీసులు జోక్యం చేసుకోవద్దని రెంజల్ ఎస్సై రవికుమార్‌కు సూచించారు.

Videos

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)