గోరక్షణ పేరుతో హింస వద్దు: భగవత్‌

Published on Sun, 04/09/2017 - 15:06

న్యూఢిల్లీ: గోరక్షణ పేరుతో హింసకు పాల్పడడం సమర్థనీయం కాదని ఆరెస్సెస్‌ అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌ అన్నారు. దేశంలో గోవధను నిషేధిస్తూ చట్టం తేవాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. 'గోరక్షణ పేరుతో ఎటువంటి హింసకు దిగినా మన లక్ష్యానికి చెడ్డపేరు వస్తుంది. చట్టాన్ని తప్పనిసరిగా పాటించాల'ని ఆయన అన్నారు. గోరక్షణ పేరుతో దాడులు పెరిగిపోవడంతో భగవత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో పెహ్లు ఖాన్‌(55) అనే రైతును గోరక్షకులు హత్య చేయడంతో ఆందోళనలు రేగాయి. బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని విపక్షాలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తాయి. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా భగవత్‌ పేరును ఇటీవల శివసేన  తెరపైకి తెచ్చింది. అయితే రాష్ట్రపతి ఎన్నిక రేసులో తాను లేనని భగవత్ ప్రకటించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ