అట్రాసిటీ కేసు: జేసీ బ్రదర్స్‌ హైడ్రామా

Published on Sat, 01/02/2021 - 14:46

సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి హైడ్రామా మొదలు పెట్టారు. సోదరుడు ప్రభాకర్‌ రెడ్డితో కలిసి ఈనెల నాలుగో తేదిన తాడిపత్రిలో ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే తాడిపత్రిలో 144 సెక్షన్‌ విధించడంతో పోలీస్‌ యాక్ట్‌ 30 అములులోకి వచ్చింది. దీంతో ఏ కార్యక్రమానికైనా పోలీసుల అనుమతి తప్పనిసరి. అయితే పోలీసులను రెచ్చగొట్టేందుకు జేసీ బ్రదర్స్ దీక్షకు సిద్ధమయ్యారు. తమపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదంటూ జేసీ బ్రదర్స్‌ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆస్మిత్‌ రెడ్డిలపై ట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసుల నుంచి తప్పించుకునేందుకే జేసీ బ్రదర్స్‌ దీక్ష పేరుతో డ్రామాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. చదవండి: తాడిపత్రిలో 144 సెక్షన్‌ : ఎస్పీ

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ