రూ.149.5 కోట్లతో అసెంబ్లీకి రాజమార్గం

Published on Wed, 06/30/2021 - 03:18

సాక్షి, అమరావతి: శాసన రాజధాని అమరావతికి రాజమార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉండవల్లి అవుట్‌ ఫాల్‌ స్లూయిజ్‌ నుంచి ఎన్‌–13 రహదారి వరకు 15.52 కిలోమీటర్ల పొడవున.. కృష్ణానది కుడి కరకట్టను వెడల్పు చేసి, పటిష్టపరచి రెండు వరుసల (డబుల్‌ లేన్‌) రోడ్డును నిర్మించడానికి నడుంబిగించింది. రూ.149.5 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. రహదారి నిర్మాణానికి అవసరమైన కేంద్ర పర్యావరణశాఖ, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ), రివర్‌ కన్జర్వేటర్‌ తదితర అనుమతులను తీసుకోవడం ద్వారా రహదారి పనులను వేగంగా పూర్తిచేసేందుకు జలవనరులశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అసెంబ్లీకి రాజమార్గాన్ని నిర్మించడం ద్వారా శాసన రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విజయవాడ నుంచి అమరావతి దారేది?
కృష్ణానది కుడి కరకట్ట పక్కన నదీ గర్భంలో నిర్మించిన అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు కరకట్టపై ఒక వరుస రోడ్డుపైనే తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయానికి రాకపోకలు సాగించేవారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. విజయవాడతో అమరావతిని అనుసంధానం చేసేలా రోడ్డు నిర్మించే ఆలోచన కూడా చేయలేదు. కళ్లెదుట కనిపిస్తున్న.. రోజూ రాకపోకలు సాగించే రహదారినే అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తున్నానంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం. కరకట్టపై ఒకే వరుస రోడ్డు ఉండటం వల్ల శాసన రాజధాని అమరావతికి రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. దీన్ని గమనించిన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన విజయవాడతో అమరావతిని అనుసంధానం చేసేలా రాజమార్గం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

సమతుల అభివృద్ధే లక్ష్యంగా..
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తానని ఐదేళ్లు హడావుడి చేసిన చంద్రబాబు చివరకు విజయవాడ నుంచి అమరావతికి కనీసం రహదారి సౌకర్యాన్ని కూడా కల్పించలేక చేతులెత్తేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ ఆకాంక్షలు, చారిత్రిక ఒప్పందాలను గౌరవించి సమతుల అభివృద్ధే ధ్యేయంగా అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తూ చట్టం చేసింది. శాసన రాజధాని అమరావతి అభివృద్ధికి నడుంబిగించింది. అందులో భాగంగానే.. విజయవాడ నుంచి అమరావతికి కృష్ణానది కరకట్ట మీదుగా రాజమార్గం నిర్మాణాన్ని ప్రాధాన్యతగా చేపట్టింది.  

Videos

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)