రికవరీ రేటు 73.66 శాతం

Published on Mon, 08/24/2020 - 04:24

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 60,637 కోవిడ్‌ టెస్టులు చేస్తున్నట్లు ఆదివారం నాటి గణాంకాల ప్రకారం స్పష్టమవుతోంది. అంతేగాక తాజాగా కోవిడ్‌ పరిస్థితులను బట్టి ఇప్పటివరకూ కోలుకున్న రోగుల సంఖ్య (రికవరీ రేటు) 73.66 శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో 46,712 టెస్టులు చేయగా 7,895 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. కోవిడ్‌ కారణంగా 93 మంది మరణించారు. ఆదివారం ఒక్కరోజే 7,449 మంది డిశ్చార్జి అయ్యారు. అంతకుముందు రోజు అంటే ఈనెల 22వ తేదీ (శనివారం) 61,469 పరీక్షలు నిర్వహించగా 10,276 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

ఇప్పటివరకూ రాష్ట్రంలో 32,38,038 టెస్టులు నిర్వహించగా 3,53,111 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఇప్పటికే 2,60,087 మంది కోలుకోగా, మరో 89,742 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌ కారణంగా మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 3,282కు చేరింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,256 కేసులు, అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 142 కేసులు నమోదయ్యాయి.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ